అంగన యెట్టుండినా నమరుగాక
Wikisource నుండి
ప|| అంగన యెట్టుండినా నమరుగాక | సంగతే నీకు నాపె సాటికి బెనగను ||
చ|| తనకు బోదైనచోట తగిలి మాటాడకున్న | మనుజుడావాడు పెద్ద మాకు గాక | చనవున బెనగగా సమ్మతించకుండితేను | ఘనత యేది చులకదనమే గాక ||
చ|| చెల్లుబడి గలచోట సిగ్గులు విడువకున్న | బల్లిదుడా వాడూ కడు పందగాక | వెల్లివిరి నవ్వగాను వీడు దోళ్ళాడకున్న | చల్లేటి వలపులేవి సటలింతే కాక ||
చ|| తారుకాణలైన చీట తమకించి కూడకున్న | చేరగ జాణడా గోడచేరుపు గాక | యీ రీతి శ్రీ వేంకటేశ యిట్టె రఘునాథుడవై | కూరిమి గూడితివిది కొత్తలింతే కాక ||
pa|| aMgana yeTTuMDinA namarugAka | saMgatE nIku nApe sATiki benaganu ||
ca|| tanaku bOdainacOTa tagili mATADakunna | manujuDAvADu pedda mAku gAka | canavuna benagagA sammatiMcakuMDitEnu | Ganata yEdi culakadanamE gAka ||
ca|| cellubaDi galacOTa siggulu viDuvakunna | balliduDA vADU kaDu paMdagAka | velliviri navvagAnu vIDu dOLLADakunna | callETi valapulEvi saTaliMtE kAka ||
ca|| tArukANalaina cITa tamakiMci kUDakunna | cEraga jANaDA gODacErupu gAka | yI rIti SrI vEMkaTESa yiTTe raGunAthuDavai | kUrimi gUDitividi kottaliMtE kAka ||
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|
|