పెం - గార్డ్! ఈ మనిషి మూడోక్లాసు టిక్కట్టుతో ఫస్టు క్లాసులో ఎక్కాడు.
అని కేక వేసేసరికి ఎవడోవచ్చి వాణ్ణి సాగదోలగా, తక్కిన వాళ్లలో ఒకడు పెంటోజీతో, ఎల్లా కనిపెట్టారు మీరిదీ ?
పెం - నా టిక్కట్టు రంగునుబట్టి.
202
రామన్న - పిచ్చెయ్యా! కనకదాసుగారు బాగున్నారూ?
పి - ఆ. నిక్షేపంలా ఉన్నాడు. ఏం?
రా - అహ. మరొహమాటవిన్నాన్లే, నేను.
పి - పనుందా?
రా - మరేలే, వేరే మాట్లాడవలిసిన పనుంది. ఇంట్లో ఉంటాడా ఇప్పుడు?
పి - బహుశా ఈ పాటికి పైకివెళ్ళుంటాడు ! లాభంలేదు.
203
పంతులు - నారప్పా! ఎంచేత ఆలస్యంగా వచ్చావ్?
నా - నాన్న ఉండిపొమ్మన్నాడండి.
పం - సరే క్షమాపణ కోరుతూ ఉత్తరంపట్రా ఆయనగారి దగ్గర్నించి!
నా - నాన్న క్షమాపణ్లుకోరే రకంకాదండి.
పం - ఏం కథ?
నా - అల్గాగనక ప్రారంభిస్తే అమ్మ, గరిటి కాలేస్తుందండి.
204
లింగప్ప - ఏమండీ! నాటకం టిక్కట్లు ఎవరు అమ్ముతూంటా?
గుమాస్తా - ఏం? నేనే, ఏంకావాలి?
లిం - నాటకపుపేపరు ఓటిల్లా ఇవ్వండి.
గు - ఇక్కడుండవు.
లి - అయితే. అర్ధచార్జీలు ఎవరెవరికి?
గు - చదువుకునే పిల్లలకి.
లిం - నాకు ఎడంకంటో పువ్వుగదామరి, నేనుకూడా పూర్తి రేటు తగలేసుకోవలిసిందే చూస్తూను!
గు - ఆ. చెముడు లేదుగా?
లిం - లేకపోతేమాత్రం! ఓపాతికేనా కొట్టెయ్యరూ?
205
రఘూరాంగారు తనకి కావలసిన వాడైన పంకజాన్ని లెక్కల పరిక్షనాడు కలుసుగుని,
ర - పంకజం! లెక్కలు ఎన్ని చేసినట్టు? అంటే రైటుగా!
పం - ప్రతీప్రశ్నా వొఠ్ఠి తప్పులకుప్ప అవుతూంటే, చెయ్యడం కుర్రాడి తరంటండీ? వాడి తాతతరమా!
ర - ఓరి! ఇప్పటి కుర్రాళ్ళది ఏమి మేధస్సురా? నువ్వు అందులో తప్పులుకూడా ఎంచావ్?
పం - ఓ. ఓ లెక్కలో “రెండువరసమైలురాళ్ళదగ్గరనుండి” అంటూ ఉంది. అందులో గొప్పతప్పూ!
భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1
44
హాస్యవల్లరి