పుట:హాస్యవల్లరి.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

197

పల్లెటూరినుంచి వెళ్ళి పట్నవాసంలో తన స్నేహితుడు నాగేంద్రుడు కలిసి నాటకం చూస్తూన్న,

శివన్నావధాన్లు - నాగేంద్రుడూ! ఈ నారదుడు వేషం వేసిన వాళ్ళూ వాళ్ళూనూ, ప్రత్యేకం ఇందుకోసం ముందునించీ గడ్డాలు పెంచుగు అట్టే పెట్టుగుంటారా ఏమిటి?

నా - అక్కర్లేదు. గడ్డాలుంటాయి.

శి - ఇందాకా మనం వస్తూంటే పొదుచ్చుగు మంగళ్ళు లోపలి కెందుకూ వెడుతున్నారూ?

నా - పొద్దున్నే వీల్లేనివాళ్ళు క్షౌరాలు చేయించుగోడానికి.

శి - అదికాదోయ్! క్షౌరంచేసినగడ్డాలు పెట్టుగుని బరిమీదికి రాకూడదూ?

198

తండ్రి - అబ్బాయి! వెంకటేశ్వర్లూ! మీపరిక్ష దరఖాస్తులు ఎప్పుడ్రా?

వెం - ఈవాళే.

తం - నువ్వు కట్టేశావా, పరిక్షకి?

వెం - హెడ్డుమేష్టరుగారు పెట్టించలేదు. నాన్నా.

తం - ఏడిసినట్టేఉంది. రూపాయలిచ్చేవాణ్ణి నేను ఇక్కడుంటూంటే ఆయనెవడ్రా కట్టించడానికీ?

వెం - ఏమో నాన్నా. ఇప్పుడెంజెయ్యనూ?

తం - పందిరిమంచం సొరుగులో రూపాయిలు దాచాను, అవి చప్పుడు చెయ్యకుండా తీసి రొండోకంటివా డెరక్కుండా కట్టేసి రా, తరువాత చూసుగోవచ్చూ!

199

ఒక గొప్పవాడు గంభీరోపన్యాసం ఇస్తూ, ఒక సందర్భంలో,

గొ - “ఒకదొరసాని నిద్రచెంది, కలగాంచి, ఆ కలలో తాను తన భర్తను ఎడబాయవలసి వచ్చుటయు, ఆ కలలో భర్త గతించెనను సంగతి తనకు తెలియవచ్చుటయు, అందుచే తానును మరణించుటయు జరిగినట్లు చూసి, ఆమె తక్షణమే నిజముగ చనిపోయెనట.”

ఒక సభ్యుడు - ఏమి ఆశ్చర్యం! ఏకాశ్చర్యం!

గొ - ఏది అది?

ఒక సభ్యుడు - ఆ కల మీకు తెలియడమే! ఆశ్చర్యం!

200

శేషు - వి. యస్. మన్యం ఫొటోలు తీస్తున్నాట్ట. ఏమన్నా బాగుంటూన్నట్టేనా? బాబూ?

బా - బాగానే ఉంటున్నాయి. కాని, మొన్న నాఫోటో తీశాడూ! ఆ తీసినపలకకి ఈశాన్యమూలమాత్రం నా రొండుకాళ్ళూ పడ్డాయి.

శే - నీ మొహంలా ఉంది!

బా - అదిలేందే, అందులో!

201

రైలులో ఫస్టుక్లాసుబండీలో ఒకడు దిక్కుమాలి కంపుకొట్టే చుట్ట తాగతూ నానాఅల్లరీ చేస్తూండడం చూసి వాడికి ఎల్లానేనా ఉద్వాసన చెప్పాలని కడంవాళ్ళు యత్నిస్తూంటే, అందులో ఉన్న పెంటోజీ కిటికీలోంచి బయటికి తలకాయపెట్టి చూసి,

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

43

హాస్యవల్లరి