పుట:హాస్యవల్లరి.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెం - గార్డ్! ఈ మనిషి మూడోక్లాసు టిక్కట్టుతో ఫస్టు క్లాసులో ఎక్కాడు.

అని కేక వేసేసరికి ఎవడోవచ్చి వాణ్ణి సాగదోలగా, తక్కిన వాళ్లలో ఒకడు పెంటోజీతో, ఎల్లా కనిపెట్టారు మీరిదీ ?

పెం - నా టిక్కట్టు రంగునుబట్టి.

202

రామన్న - పిచ్చెయ్యా! కనకదాసుగారు బాగున్నారూ?

పి - ఆ. నిక్షేపంలా ఉన్నాడు. ఏం?

రా - అహ. మరొహమాటవిన్నాన్లే, నేను.

పి - పనుందా?

రా - మరేలే, వేరే మాట్లాడవలిసిన పనుంది. ఇంట్లో ఉంటాడా ఇప్పుడు?

పి - బహుశా ఈ పాటికి పైకివెళ్ళుంటాడు ! లాభంలేదు.

203

పంతులు - నారప్పా! ఎంచేత ఆలస్యంగా వచ్చావ్?

నా - నాన్న ఉండిపొమ్మన్నాడండి.

పం - సరే క్షమాపణ కోరుతూ ఉత్తరంపట్రా ఆయనగారి దగ్గర్నించి!

నా - నాన్న క్షమాపణ్లుకోరే రకంకాదండి.

పం - ఏం కథ?

నా - అల్గాగనక ప్రారంభిస్తే అమ్మ, గరిటి కాలేస్తుందండి.

204

లింగప్ప - ఏమండీ! నాటకం టిక్కట్లు ఎవరు అమ్ముతూంటా?

గుమాస్తా - ఏం? నేనే, ఏంకావాలి?

లిం - నాటకపుపేపరు ఓటిల్లా ఇవ్వండి.

గు - ఇక్కడుండవు.

లి - అయితే. అర్ధచార్జీలు ఎవరెవరికి?

గు - చదువుకునే పిల్లలకి.

లిం - నాకు ఎడంకంటో పువ్వుగదామరి, నేనుకూడా పూర్తి రేటు తగలేసుకోవలిసిందే చూస్తూను!

గు - ఆ. చెముడు లేదుగా?

లిం - లేకపోతేమాత్రం! ఓపాతికేనా కొట్టెయ్యరూ?

205

రఘూరాంగారు తనకి కావలసిన వాడైన పంకజాన్ని లెక్కల పరిక్షనాడు కలుసుగుని,

ర - పంకజం! లెక్కలు ఎన్ని చేసినట్టు? అంటే రైటుగా!

పం - ప్రతీప్రశ్నా వొఠ్ఠి తప్పులకుప్ప అవుతూంటే, చెయ్యడం కుర్రాడి తరంటండీ? వాడి తాతతరమా!

ర - ఓరి! ఇప్పటి కుర్రాళ్ళది ఏమి మేధస్సురా? నువ్వు అందులో తప్పులుకూడా ఎంచావ్?

పం - ఓ. ఓ లెక్కలో “రెండువరసమైలురాళ్ళదగ్గరనుండి” అంటూ ఉంది. అందులో గొప్పతప్పూ!

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

44

హాస్యవల్లరి