య - లెక్కల్లో మీవాడు “గుడ్” అని వాళ్ళ క్లాసు మేస్టరు ఈ వేళ పొద్దున్నే అన్నారండి.
అ - లెక్కల్లో గుడ్డయితే నువ్వు చెప్పి చచ్చిందేమిటయ్యా మరీ!
58
సోమన్న - ఒరేయి, కోటిలింగం! నేనూ నాభార్యా, మే మిద్దరం పట్టంలో ఉంటే సాలీనా ఏమవుతుందిరా?
కో - నువ్వూ నీభార్యా కలిసి పదిమంది పెట్టు. ఇద్దరేమిటి? ఎంతేనా అవుతుంది.
సో - పదిమందేమిట్రా, నీమోహం?
కో - అవునురా. నీభార్య ఒకటి. నువ్వు సున్న. ధరిమేనా జేరిస్తే పదీ.
59
పంతులు - దానాలన్నింటిలోకీ గొప్పదేది? భైరవరావు!
భై - అన్న దానమండి.
పం - నీ ఉద్దేశం? సుబ్బరాజు
సు - మైదానమండి, గుర్రపుసవ్వారీకి.
లక్ష్మణ సెట్టి - నే చెప్పనాండి.
పంతు - కానీ.
ల - ఉపాదానం అండి.
పంతు - భేష్. ఇది అన్నిటికీ పైదానం. అల్లానే కానీ, ఒకోక్కడికి ఒకొక్కటి నిదానం.
60
బ్రాహ్మడు - ఏమట్టుకొచ్చిందోయ్, వడ్డాణం.
కంసాలి - అబ్బే మెరుగు తరవాయండి.
బ్రా - అదెప్పుడు మళ్ళీ?
కం - ఇప్పుడేగాని ముందు ఈకంటె చూడండిబాబూ!
బ్రా - (చూస్తూ) ఏం?
కం - ఇది కల్తీదని ఏచవటవెధవ అనగలడండీ!
బ్రా - అవునోయి. చాలా దివ్యంగావుంది.
61
మధ్యవర్తి - ఏమిటోయ్, ఈ పేచీ, శ్రీరంగం?
శ్రీ - ఈ తారకం నన్ను తిట్టాడండీ!
మ - ఏమోయ్ తారకం?
తా - చిత్తం.
మ - ఏమనోయ్, శ్రీరంగం
శ్రీ - "పోరా, వెధవన్నరగా” అన్నాడండి.
మ - ఏమోయ్ నిజమేనా?
తా - చిత్తం.
మ - అల్లాతిట్టచ్చా? ఋజువు చెయ్యలేనిమాట ఆడచ్చా?
తా - చిత్తం. ఋజువు చేస్తానండి.
మ - ఎల్లా?
భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1
14
హాస్యవల్లరి