పుట:హాస్యవల్లరి.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

- నీ పేరేమిటి, తమ్ముడూ?

పె - పెద్దన్నండి. స్కూల్లో వెంకటపెద్దన్నారావు,

- సరే, ఇది పుచ్చుగో

అని ఒక రూపాయిలనోటు ఇవ్వగా,

మే - బాబుగారూ, ఆ దయచేసేది ఎల్లనూ దయచేస్తున్నారు గనక మొదటివాడికే ఇస్తే. పోనీ!

- స్వస్థలంలో దీపం పెడుతూన్నవాడికి ఓతృణం ముట్ట చెప్పడం తప్పనా తమరనేది! చాల్లేస్తురూ!

53

తల్లి - సత్తెం! ఓరి సత్తెం! ఇల్లారా!

- (వచ్చి) ఎందుకే అమ్మా!

- ఇంద (అని బెల్లమ్ముక్క చేతిలో పెట్టి) వెళ్ళి, మన సాలలో బియ్యం దంపుతున్నారు చూశావ్, వాళ్లతో, బియ్యం తెల్లగా వెయ్యమని చెప్పిరా.

- (వెడుతూ) సరే.

- ఏమని చెబుతావ్?

- బెల్లం తియ్యగా వెయ్యమంటాను!

54

దీక్షితులు - గుమాస్తాగారూ మీ ఊరు సంత ఎప్పుడండి?

గు - పోనీలేస్తురూ మీ కెందుకు ఆ వెధవసంత!

దీ - అబ్బా! మీ ఊళ్ళో అల్లాంటి సంతకే ఉన్నారేం జనం? లోటులేదు.

55

సోమప్ప - ఒరేయి కనకం! భానోజీ పెద్ద భాండం కొన్నాడు.

- ఘటవాయిద్యం చేస్తాడా ఏమిటి?

సో - వీడికివాయిద్యం ఏమిటి? అవతల పట్నంకుంపినీవాడు ఇదివరకే వాయించి పుచ్చుకున్నాడు బాగా రెండు వందలైతే.

- అబ్బో! అంత పెద్దదిట్రా! లోహపదామిటీ?

సో - లోహం ఏమిట్రా నిం దగలెయ్యా! నూట యాభై పుస్తకాలు పైగా ఉంటేను!

56

హనుమంతు - (సిసింద్రీకిమల్లే ఉన్న రాజాలుతో) రండి రండి! పర్వతావధానులుగారు

రాజాలు - (పొణకంతున్న హనుమంతుతో) చిత్తం చిత్తం. వస్తునానండి నల్లమూ సంభొట్లుగారు.

హను - నేను తమ తెలివిని గురించేష్మండి మాట్లాడతా, శరీరం కాదు!

రా - నేనూ అంతేనండి.

57

అవధాని - ఏమండీ యల్టీమేష్టరుగారూ! మా వాడికి ప్రైవేటు చెపుతున్నారు గందా, లెక్కల్లో ఈ కుంక ఎల్లా వున్నట్టూ!

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

13

హాస్యవల్లరి