ఉ - నీ పేరేమిటి, తమ్ముడూ?
పె - పెద్దన్నండి. స్కూల్లో వెంకటపెద్దన్నారావు,
ఉ - సరే, ఇది పుచ్చుగో
అని ఒక రూపాయిలనోటు ఇవ్వగా,
మే - బాబుగారూ, ఆ దయచేసేది ఎల్లనూ దయచేస్తున్నారు గనక మొదటివాడికే ఇస్తే. పోనీ!
ఉ - స్వస్థలంలో దీపం పెడుతూన్నవాడికి ఓతృణం ముట్ట చెప్పడం తప్పనా తమరనేది! చాల్లేస్తురూ!
53
తల్లి - సత్తెం! ఓరి సత్తెం! ఇల్లారా!
స - (వచ్చి) ఎందుకే అమ్మా!
త - ఇంద (అని బెల్లమ్ముక్క చేతిలో పెట్టి) వెళ్ళి, మన సాలలో బియ్యం దంపుతున్నారు చూశావ్, వాళ్లతో, బియ్యం తెల్లగా వెయ్యమని చెప్పిరా.
స - (వెడుతూ) సరే.
త - ఏమని చెబుతావ్?
స - బెల్లం తియ్యగా వెయ్యమంటాను!
54
దీక్షితులు - గుమాస్తాగారూ మీ ఊరు సంత ఎప్పుడండి?
గు - పోనీలేస్తురూ మీ కెందుకు ఆ వెధవసంత!
దీ - అబ్బా! మీ ఊళ్ళో అల్లాంటి సంతకే ఉన్నారేం జనం? లోటులేదు.
55
సోమప్ప - ఒరేయి కనకం! భానోజీ పెద్ద భాండం కొన్నాడు.
క - ఘటవాయిద్యం చేస్తాడా ఏమిటి?
సో - వీడికివాయిద్యం ఏమిటి? అవతల పట్నంకుంపినీవాడు ఇదివరకే వాయించి పుచ్చుకున్నాడు బాగా రెండు వందలైతే.
క - అబ్బో! అంత పెద్దదిట్రా! లోహపదామిటీ?
సో - లోహం ఏమిట్రా నిం దగలెయ్యా! నూట యాభై పుస్తకాలు పైగా ఉంటేను!
56
హనుమంతు - (సిసింద్రీకిమల్లే ఉన్న రాజాలుతో) రండి రండి! పర్వతావధానులుగారు
రాజాలు - (పొణకంతున్న హనుమంతుతో) చిత్తం చిత్తం. వస్తునానండి నల్లమూ సంభొట్లుగారు.
హను - నేను తమ తెలివిని గురించేష్మండి మాట్లాడతా, శరీరం కాదు!
రా - నేనూ అంతేనండి.
57
అవధాని - ఏమండీ యల్టీమేష్టరుగారూ! మా వాడికి ప్రైవేటు చెపుతున్నారు గందా, లెక్కల్లో ఈ కుంక ఎల్లా వున్నట్టూ!
భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1
13
హాస్యవల్లరి