పుట:హాస్యవల్లరి.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గు - (ఆఫారం మీద కొన్ని టిక్కులు పెట్టి) మాటలు పన్నెండూ ఉన్నాయికాని, రెండుమూడు మాటలు తెలియడం లేదు. తిన్నగా రాయించుగు రండి. లేకపోతే రాసుగురండి.

- నా దస్తూరీ అవతలవాడికి తెలుసు. కొట్టెయ్యండి బాబూ మీకెందుకు మా ప్రైవేటు గొడవలన్నీనూ!

48

మీనాక్షి - కాకపోయినా, మహ అయిపోతున్నాయిస్మీ ఈ కాలం పెళ్ళిళ్ళు!

పిచ్చెమ్మ - మరేనండీ పిన్నిగారూ, చోద్యం అవుతుంది! అందులో ఆడపిల్లలకి మరీనూ!

మీ - ఇంకా నిమ్మణంగా అంటావేమిటి? వాళ్ళ సంఖ్యలో సహమేనా ఉండదు, పెళ్ళయిన మొగముండావాళ్ళసంఖ్య.

49

పుట్టంధుడు - పాలు ఎలా ఉంటాయ్, మాణిక్యాలూ?

మా - తెల్లగా ఉంటాయి.

పు - తెలుపెల్లా ఉంటుంది.

మా - కొంగరెక్కల్లా ఉంటుంది.

పు - మరి కొంగ ఎల్లాఉంటుంది?

మా - ఇల్లా. అని మాణిక్యాలు చెయ్యి వంకరటింకరగా పెట్టగా ముట్టుగుని తడిమి.

పు - అయితేమరి పాలు గొంతిక్కి చిక్కడవేం మరీ?

50

సైకిల్ మీద టెలిగ్రాఫు బంట్రోతు వచ్చి, టెలిగ్రాం ఇవ్వడంతోటే సుభద్రం అదివిప్పి చూసుగుని మొఖం ఇంత చేసుకోగా,

విశాలరావు - ఏమిట్రోయ్, విశేషం? పరీక్షా, లాటరీఆ?

సు - ఏదీకాదూ, నప్షల్స్ అయిందిట.

వి - నీకేనామిటీ?

సు - కాదు, మాతోడల్లుడికి.

వి - ఎవరిచ్చారు టెలిగ్రాం?

సు - మా మామగారే.

వి - ఏదీ ఇల్లాతే (అని పుచ్చుగు చూసి) మీ మామగారి దస్తూరీ బాగానే ఉంటుంది. కొట్టూ!

51

మూలస్వామి - దొరయ్యా! నువ్వు ఎంతో మంచివాడవని నలుగురితోనూ చెబుతూంటాను.

దొ - తమరు శుంఠలని నేనూ అందరితోటీ మనవి చూస్తూంటాను.

మూ - నీమాట నమ్మద్దూ, ప్రపంచం?

దొ - నీమాట నమ్మేడిశారూ, అప్పిడేను, నామాట నమ్మకపోవటానికి?

52

ఒక ఉద్యోగస్తుడు మాతృపాఠశాలకి వెళ్ళి తరగతులన్నీ చూస్తూ నాలుగో తరగతి దగ్గిర ఆగి,

- బాలులారా! మీలో ఆఖరువా డెవడో నుంచోవాలి.

(అనగానే ఒక పెద్దన్న నిమ్మళంగా నిలబడగా)

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

12

హాస్యవల్లరి