పుట:హరివంశము.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ, 2

51


క.

శ్లోకంబులు రెం డివె య, స్తోకగభీరార్థవచనశోభితములు నీ
వా[1]కాంపిల్యాధీశ్వరుఁ, డాకర్ణింపంగఁ జదువు మనుఁగులు నుండన్.

209


ఆ.

వినిన యపుడ ధరణివిభుఁ డగ్రహారంబు, లును ప్రభూతవస్తుధనచయములు
నిచ్చు నీకు దీనఁ బొచ్చెంబు లేదు మో, దంబుఁ బొందు మధికధర్మనిరత.

210


వ.

అని యతని కవ్వాక్యద్వయంబు విదిశంబు సేసి యాశ్వాసించి యామంత్రబాణం
బొనర్చి వెడలి చని.

211


క.

రాగాదిదుర్లభంబు [2]ను, పాగతసత్యాద్వయోదితానంద నిరు
ద్వేగము నగు యోగం బా, యోగీశ్వరు లొంది చెంది రుత్తమసిద్ధిన్.

212


వ.

ఇక్కడ బ్రహ్మదత్తునకుం దత్పితామహుం డగు విభ్రాజుండు తొంటి తపస్సమయ
సంకల్పంబువలనం బుత్రుం డై విష్వక్సేనుం డనం బ్రభవించె నట్లు లబ్ధసంతా
నుం డై యతండు దేవీసమేతంబుగా నగరబహిరుద్యానంబున విహరించుచు
నొక్కనాఁ డేకాంతంబున.

213


క.

ఒకచీమ తనప్రియుడు కా, ముకుఁ డై యర్థిఁ దెలుపంగ మును బూనిన కిం
కకుఁ బాయక భంగించు ప, లుకు లాకర్ణించి తగఁ బెలుచ నవ్వుటయున్.

214


క.

మానిని యెంతయు సిగ్గును, దీనతయును గదిరి పెక్కుదినము లనశన
ధ్యానపరిమ్లానత[3]మెయిఁ, దానూరక యున్నఁ బ్రభుఁడు తద్దయు వంతన్.

215


వ.

నిత్యంబునుం దలంచి యవ్విధంబునకు నిమిత్తం బడిగిన నవ్వెలంది నీవు నవ్వుట
నన్ను గేలిగొనినచందంబ యందు సందియంబు లే దట్లు గావున జీవితం బింక
నేమిటి కనిన నతం డానవ్వునకుం గారణంబు సెప్పె నెంత సెప్పిన నయ్యింతి
నమ్మని నెమ్మనంబుతోడ.

216


చ.

పురుషవరేణ్య యేల యిటు పొచ్చెపుమాటల న న్మొఱంగె దె
వ్వరు జనకోటియం దెఱుఁగువారు పిపీలికపల్కు దేవతా
వరమున నొండెఁ దొల్లిటిభవంబు తపంబున నొండె నద్భుతా
ధ్వరవిధి నొండెఁ గాక గరువం బగు తత్పరిబోధ మబ్బునే.

217


క.

నీ నగవునకుం గారణ, మే నమ్మం దెల్లఁగాఁగ నెఱుఁగఁగ నది యె
ట్లైన నొనర్పక యుండిన, నే నిదె నీయానఁ బ్రాణ మింతట విడుతున్.

218


వ.

అనిన నతం డెయ్యదియునుం జేయనేరక యయ్యాపదకుం బ్రతీకారంబు చింతించి
యార్తశరణ్యుం డగు నారాయణు నుద్దేశించి యుపవాసంబుతో నాఱుదినంబులు
పడియుండ నాఱవనాఁటి వేకువనుం గలలోన వచ్చి యద్దేవుండు.

219


క.

వినుమీ [4]రేపకడయ ని, న్ననుపమశోభనము వొందు ననుమానము లే
దనఘా విడువు విషాదం, బనియె నతఁడు మేలుకనియె నక్షణమ తగన్.

220
  1. కాంపిల్యపురీశ్వరుఁ
  2. న, నాగతనిత్యా
  3. యై; తో.
  4. రేకడపల