పుట:హరివంశము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

హరివంశము


క.

హరిచేత వరము వడసితిఁ, జరితార్థుఁడ నైతి ననుచు జనపతి ప్రాతః
కరణీయము దీర్చి యలం, కరణంబుల నుల్లసిల్లి కాంతయుఁ దానున్.

221


వ.

మాణిక్యఖచితం బగు కనకరథం బెక్కి కండరీకుండు సారథ్యం బొనరింప బాభ్ర
వ్యుండు వెల్లసీవిరి వట్ట నిట్టలం బగు విభవంబునం బురంబు సొచ్చునెడం గొడు
కులు నలువురుం గఱపిన పద్యంబులు పాఠంబులు గొని బ్రాహ్మణుం డిది నాకు
నవసరం బని సువ్య క్తవర్ణోచ్చారణం బగు నెలుంగున రాజులును మంత్రులును
వినఁ దద్వాక్యార్థం బి ట్లని పఠించె.

222


సీ.

అమలదశార్ణదేశమునయం దేడ్వురుబోయ లై తొలితొలిఁ బుట్టి పిదపఁ
[1]గాలాంజనం బను శైలోత్తమంబునఁ బెనుపార మృగము లై జనన మొంది
తనరుశరద్వీపతలమునఁ జక్రవాకంబు లై ప్రభవించి క్రమ్మఱంగ
మానసాహ్వయ మగు మహితసరోరుహాకరమున హంసతాగరిమ నొంది


తే.

[2]పరఁగి రెవ్వారు మును వేదసార[3]దృశ్వ, లా కురుక్షేత్రసంజాతు లైన విప్రు
లట్టివా రదె కడుదూర మైన తెరువు, చనిరి వారలఁబడి దప్పఁ జనునె మీకు.

223

బ్రహ్మదత్తుఁడు దేవీసహితంబుగా బరమసిద్ధి వడయుట

వ.

అని [4]పఠియించిన విని బ్రహదత్తుండు విచేతనుం డైనయట్లు చేష్టలు దక్కెఁ గండరీ
కుండు కేలనున్న [5]యమ్ములుకోలయుం బగ్గంబులు విడిచి సంధులు ప్రిదిలి యుండె
బాభ్రవ్యుండు నిపతితచామరం బగు కరంబుతో నస్వస్థచిత్తుం డయ్యె వారిం
జూచి పరివారంబును పౌరులు నాగంతుకులును భయవిస్మయంబుల మునింగి
[6]కలంగిరి కొంతవడికిం దెలిసి యమ్మువ్వురు.

224


క.

చెఱిచినది గన్న తెఱఁగున, మఱచిన తొలిబాము లెల్ల మదిఁ గని నిష్ఠన్
[7]దఱిగొల్పెడు యోగస్థితి, తెఱఁ గంతయు బుద్ధికిం బ్రతీతం బైనన్.

225


వ.

ఆనందరసతన్మయు లైరి తదనంతరంబ.226
ఉ. నిండుమనంబుతోడ ధరణీపతి యాధరణీసురోత్తమున్
బండితపూజితున్ మధురభాషల నెంతయుఁ [8]దేల్చి కోరికల్
నిండ నఖండవస్తుశతనిర్భరసంపద లిచ్చి తృప్తి యొం
డొండ యొనర్చి వీడ్కొలిపె [9]నుత్సుకతం ద్వరమాణచిత్తుఁ డై.

227


మ.

సమదారాతితమిస్రభానుఁ డగు విష్వక్సేను నాత్మీయసూ
ను మహారాజ్యపదంబున న్నిలిపి తానున్ దేవియు మంత్రియు
గ్మముతోడన్ జనుదేర నిర్భరవిరాగస్వాంతతన్ గాననాం
తమునం దర్థి వసింప నేఁగె విగళత్పాశ ప్రభావోద్ధతిన్.

228


వ.

అప్పుడు మహాయోగతత్పర యగు తత్పత్ని యతని కి ట్లనియె.

229
  1. కాలంజరం
  2. పెరిగి
  3. సదృశు
  4. వివరించిన
  5. యమ్మునికోల
  6. యడంగిరి
  7. [చూ. ఆరణ్య. 7-36]
  8. దెల్చి
  9. నుత్సుకతత్పర