పుట:హరివంశము.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

హరివంశము


ప్రసాదించెద దానం జేసి యోగసిద్ధుండవై సిద్ధమూర్తులకు [1]పితరులం బ్రత్య
క్షంబుగాఁ గనియెద వని చెప్పి సనత్కుమారుండు మఱియు నిట్లనియె.

151


సీ.

పూర్వయుగంబునఁ బుణ్యశీలుఁడు భరద్వాజమునీంద్రుని[2]తనయు లేడ్వు
రుత్తమయోగధర్మోపేతులై యుండి దుశ్చరిత్రము కొంత దొడరుటయును
భ్రంశంబుఁ బొంది తపము మున్నుసేసియు సిద్ధి గానక కడుఁ [3]జేవ దక్కి
తోయనిమగ్నవస్తువు రోయుభంగిఁ బశ్చాత్తాపమునఁ దత్ప్రసన్నగతియ


తే.

తలఁచి తలఁచి యెందును దరిదాఁక లేక, కాలధర్మము నొంది నాకమున కరిగి
యందు దివ్యసుఖంబుల నధికదీర్ఘ, మైనకాలంబు సలిపి మర్త్యమున వెలసి.

152


వ.

ఇప్పుడు వారు కౌశికుం డనుమునికిం బుత్రులై జన్మించియున్నవారు వా రింకఁ బితృ
ప్రీతికై ఘోరహింస యొకటి యొనర్చెదరు దానం జేసి కుత్సితయోనులం
బెక్కింటం బుట్టవలసియుండుఁ బితృప్రసాదంబు కలిమివలన నన్నిభవంబులందును
జాతిస్మరత్వం బనుబంధంబై వచ్చుటం బ్రకృష్టం బగుధర్మచరితంబునఁ జిత్తంబులు
వొలయం గలయవి పిదప బ్రాహణజన్మంబు వడసి మొదలఁ [4]బ్రారబ్ధం బైన
యోగధర్మం బెప్పటియట్ల [5]కని పరమసిద్ధియుం బ్రాపింతు రట్ లుగావున.

153


మ.

సకలక్లేశనిబర్హణంబును మహాసారంబు సర్వార్థర
ర్శకమున్ సిద్ధనిషేవితంబు నగు సూక్ష్మజ్ఞానయోగంబు నీ
వకలంకస్థిరబుద్ధిఁ దాల్చి నియతాహారుండవై [6]యింద్రియ
ప్రకరోచ్ఛేద మొనర్చియుండుము పరబ్రహ్మంబు ప్రాప్తం బగున్.

154


తే.

యోగ[7]ధర్మంబునకు నెక్కు డొక్కటియును, నిఖిల[8]మందును లేదిది నిశ్చయంబు
నీమనమునందు నిక్కంబు నిలిపితేనిఁ, జేరుఁ గాలక్రమంబున సిద్ధపదము.

155


వ.

అని యానతిచ్చి నన్నుం బరమానుగ్రహదృష్టిం బరిగ్రహించి యయ్యగ్రిమ
బోధనిధి యచ్చోటన యంతర్ధానంబునొందె నట్లద్దేవమునితోడి సంభాషణతత్పర
త్వంబున నున్న [9]నాకు సంవత్సరంబులు పదునెనిమిదియు నొక్కదివసంబపోలెఁ
గడచె నాఁకలి నీరువట్టు డప్పి నిద్ర యనునవి మొదలయిన మానుషధర్మంబు
లెవ్వియునుం బొంద కతిక్రాంతం బైనకాలంబును బిదప శిష్యులవలన నెఱింగితిఁ
దదనంతరంబ.

156


క.

విజ్ఞానము మునుపుగ భ, వ్యజ్ఞానము దివ్యచక్షురన్వితముగ స
ర్వజ్ఞుం డగునమ్మహాత్ముని, యాజ్ఞన్ బ్రాదుర్భవించి నప్పుడు నాకున్.157
వ. అట్టి దివ్యదృష్టివలన నే నున్నచోటన యుండి కురుక్షేత్రనివాసులైన కౌశిక
పుత్రు లయ్యేడ్వురం గంటి నందులో నేడవువాఁడు శుకపుత్రి యైనకీర్తిమతికి[10]
నణుహుం డను రాజువలన బ్రహ్మదత్తుం [11]డనువాఁడై పుట్టి కాంపిల్యపురాధి

  1. పితృవరులం
  2. తనూజు
  3. జేష్ట
  4. బ్రారంభం బైన
  5. కనియెదరు
  6. యీ క్రియం బ్రకరోచ్ఛేద
  7. ధర్మంబు కెక్కు డొండొక్కటియును
  8. మునయందు
  9. యా
  10. 'కృత్వి' అని ప్రకృతముద్రితమూలపాఠము.
  11. డనఁ బుట్టి