పుట:హరివంశము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

45

పూర్వభాగము - ఆ, 2


పతియై పిదప యోగసిద్ధి వడసి నని మార్కండేయుండు సెప్పె నని చెప్పుటయు
భీష్ముతో ధర్మజుం డిట్లనియె.

158


క.

అనఘ యణుహుఁ డేవంశ, మ్మునవాఁ డేకాల మతనిపుట్టువు తన్నం
దనుఁ డయ్యె నెట్లు కౌశిక, తనయుఁడు సప్తముఁడు బ్రహ్మదత్తుఁ డనంగన్.

159

భీష్ముఁడు ధర్మరాజునకుఁ గౌళికపుత్రులచరిత్రంబు చెప్పినప్రకారము

క.

అతినిందితజన్మము లే, గతిఁ జెందిరి వరుసఁ గౌశికప్రభవులు స
ద్గతి యెమ్మెయిఁ గలిగెఁ బిదప, నతులయశా దీనిఁ దెలుపు మంతయుఁ గరుణన్.

160


వ.

అనిన భీష్ముం డిట్లనుఁ బూరువంశంబునం బురుమిత్రుం డను రాజు గలిగె నతనికి
బృహద్ధిషుండును నాతనికి బృహద్ధన్వుండును నన్నరనాథునకు సత్యకర్ముండును
సత్యజిత్తునుం బుట్టిరి.

I61


తే.

విశ్వజి త్తనఁగాఁ బుట్టె వినుము సత్య, జిత్తునకుఁ దత్తనూజుండు సేనజిత్తు
వాని కాత్మజుల్ నలువు రవార్యబలులు, పుట్టి రందులో రుచిరుండు భూరిబలుఁడు.

162


వ.

పాంచాలేశ్వరుండై తేజరిల్లి పృథుసేనుం డను రాజుం గనియెఁ బృథుసేనునకుఁ
బారుండు పుట్టెఁ బారునకు [1]నిశాభిధానుం డుద్భవించె.

163


క.

సుతశతముఁ గాంచె నాతం, డతిరథులై [2]నిపుణు లనుసమాఖ్య బడసి రం
దతిశూరుఁడు సమరుం డన, నతఁ డభిమతసమరుఁ డెందు నభినుతిఁ బొందెన్.

164


వ.

సమరునకుఁ బృథుండును బృథునకు విభ్రాజుండును జనియించిరి. విభ్రాజున
కణుహుండు పుట్టె నతనికి [3]శుకదుహితయైన కీర్తిమతి బ్రహ్మదత్తుం గనియె
నయ్యణుహుండు మత్పితామహుం డగు ప్రతీపభూపాలునాఁటివాఁడు తత్సు
తుం డగు బ్రహదత్తునకు విష్వక్సేనుండును నతనికి [4]దండసేనుండును జనియించిరి.
దండసేనుండు కాంపిల్యంబునకు రాజై తక్కిననృపుల నందఱం బరిపాలించు
చుండు ద్రుపదపితామహుండును బృషతజనకుండును నగు[5]దండసేనునిపై నజా
మీఢవంశోద్భవుం డగునుగ్రాయుధుండు వచ్చి వరదానలబ్ధం బగుచక్రంబుకలిమి
నతిదుర్జయుండు గావున.

165


క.

సమరంబు చేసి యతనిని, సమయించి తదీయవంశజాతులనెల్లన్
గ్రమమునఁ బెక్కండ్రఁ దునిమె, సమదభుజాటోపచటుల[6]సంభరితమతిన్.

166


వ.

ఇవ్విధంబున [7]దండసేనుం దొట్టి నృపాలాన్వయులం బెక్కండ్ర మడియించి.

167

భీష్ముఁ డుగ్రాయుధుం డనురాజుం జంపినప్రకారము

ఉ.

ఎందును మాఱు లేక ధరణీశులఁ బల్వుర నాజిఁ జెండియున్
మ్రందఁగఁ జేసి కైకొనక నన్ను జయించుతలంపుతోడ నా

  1. నీపాభి
  2. ననృపుల సమరాఖ్యుఁ బడసె నం
  3. శుకునకు జామాత
  4. నుదక్సేనుండు (సం. ప్రతిలో దండసేనుండు.)
  5. నీలు; నీపు
  6. సంరంభ
  7. నుదక్సేను. (సం. ప్ర. దండసేనుం.)