పుట:హరివంశము.pdf/564

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

516

హరివంశము

     చారవిహీనమై రవినిశాకరదీప్తులు లేక చీఎకటుల్
     పేరిన యొక్కచోటు గని పెద్దయు విస్మయ మంది యందరున్.206
వ. అవులఁ గడచిపోవం దమకు శక్యంబు గాకున్న నంతటన యుండి.207
క. వేయేఁడుల వ్రతమునకై , ధీయోగము సిద్ధి నొంద దీక్షించి మనః
     కాయవచోనియమము నిర, పాయంబుగఁ దొడఁగి రురుతపస్సాధనకున్.208
తే. అందుఁ గశ్యపసంయమి యంగనయును, దాను బ్రహ్మచర్యవ్రతధారణమున
     నిలిచి వీరాసనస్థుఁడై జలధిశయను, జలజనయనుఁ జేతోంబుజస్థాయిఁ జేసి.209
క. మును మునిముఖ్యులు భక్తిం, గొనియాడఁగ నిఖిలనిగమగోప్యం బై యొ
     ప్పినవాఙ్మయమున ని ట్లని వినుతించె ననంతమహిము విశ్వాత్ము హరిన్.210
చూర్ణిక. జయ జయ జగదుద్భవ స్థితిసంహార హేతుగుణ [1]నిర్ధరణ వ్యవహితానేక
     మూర్తి విలసన! సనకాదియోగీంద్రహృదయ సరోరుహ[2]సౌరభ్య సంవి
     ధానావేశ వంశవర్ధన వదనవినిస్సృతానంతవాఙ్మయ ప్రవాహ పవిత్రీ
     శృతాఖిలలోక! లోకాయతికాది దుస్తర్క తిమిరాంధదురధిగమదివ్యాను
     భావ! భావనాపరాయణ [3]ప్రణయవారణ ప్రవణ కరుణాపరిణామవత్క
     టాక్ష నిరీక్షణ! క్షణదాచరాపసర్పణ సగర్వ దుర్వార సంచరణ చటుల
     చక్ర[4]ధర దండహస్త కమల! కమలభవోత్పత్తి నిమిత్త నిర్నిమీలననాభి
     శతపత్ర! పత్రరథేశ్వర పత్ర పతాకభావసేవాద్వైతవిద్యాసిద్ధ్యత్
     ప్రసాదసౌముఖ్య! ముఖ్యమునినికర నిరంతరోద్గీతనామసహస్ర! సహ
     స్రాంశు పరిభావప్రభావవిభవ! భవరుజాబైషజ్యచరణ సరోరుహసమ్య
     క్సమారాధన! ధనపతి నిధి నివహశత కామధేనువ్రజ కల్పతరుగహన[5]లక్ష్మ
     సదృక్ష! క్షణమాత్ర మూర్తి సంస్మరణ సుకృత! కృతప్రముఖ యుగ
     చతుష్టయ ప్రతిష్టాపిత సర్వధర్మప్రతిష్టాపన వ్యవసాయసంప్రవృత్త వివిధ
     విచిత్రావతార! తారకానాథ నలినీనర్మసఖ స్వరూపనయన యుగళాలోక
     శ్రమిత కాల చక్ర[6]బాల! బాలభాను సమీన నాభి కౌస్తుభ గభస్తి
     ప్రసర సాంధ్య ఘనాయితదోరంతర తమాలకానన! కాననాట శ్లోకిత
     శ్లాఘ్య యశో మౌక్తికావతంసిత శ్రుతి సీమంతభాగ! భాగధేయ పరం
     పరా భోగ భక్తి విభ్రమ ! భ్రమ దమిత సంసృతి ప్రపంచ పరిణత యంత్ర
     స్వతంత్ర సూత్రధార! [7]ధారణక్రమాభ్యాస ప్రాప్య పరమస్థాన!
     [8]స్థానాభిమానియవిధృత విశ్వ వ్యాపకా నేకరూప! రూపగుణకర్మ వ్యతి

  1. నిర్ధారిత
  2. సౌరభ్య సంవిదావేశ వదన
  3. పరాయణ వారణ
  4. దర
  5. లక్షసదృక్ష
  6. పబలకు లళలకు అభేదము. కాఁగా 'చక్రవాళ'.
  7. ధారణా
  8. 'స్థానాభిమానితా' అని యిటులు మార్చి చూచినచో అర్థమునకు కొంత చేరిక యగును.