పుట:హరివంశము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఫూర్వభాగము అ. 1

7


నది యేనునుం జెప్పెద వినుండు. మహాభారతశ్రవణానంతరంబ యాపరీక్షిత్తన
యుండు పరాశరతనయశిష్యున కి ట్లనియె.

49


సీ.

మునివర కురువంశమును యాదవాన్వయంబును నాదుమది కొక్కప్రోవ కాఁగఁ
దోఁచుఁ గౌరవగోటిఁ దొడరి కీర్తించుచో యాదవులను జెప్పి తచట నచట
నంతటఁ దృప్తి నాయంతరంగంబున కొదవదు. తదృృత్త మొకటి గొఱఁత
వడకుండఁ బ్రత్యక్షపరిచితం బైనదిగాదె నీబుద్ధికిఁ గాన యిప్పు


తే.

డివు సెప్పఁగ వినుట సమిద్ధహర్ష, కరము పరమేష్ఠి మొదలుగాఁ గ్రమముతోడ
నలయు ప్రఖ్యాతపురుషులవర్తనములు, గూడ నెఱిఁగింపవే వృష్ణికులమువిధము.

50


క.

అని బహుమానముగా నడి, గిన జనమేజయున కతులకృప వైశంపా
యనముని యిట్లను నభినం, దనపూర్వకముగ నుదాత్తతరహృద్యోక్తిన్.

51


చ.

విను హరివంశనామమున విశ్రుతమైన పురాణ మగ్రిమం
బనుపమవాగ్విశేషవిభవాఢ్యుండు సత్యవతీసుతుండు సె
ప్పినయది యేను నీకు వినిపించెదఁ బూజ్యతమంబు వంశవ
ర్ధనము సమస్తపుణ్యఫలదం బిది శ్రోతకు వక్తకున్ నృపా.

52


ఉ.

భాసితశుద్ధియుక్తుఁడవు భవ్యయశుండవు నైననీవ యు
ద్భాసితబుద్ధియుక్తమును భవ్యయశంబును నైన[1]యాదవో
ల్లాసచరిత్రమున్ వినఁ దలంపఁగ నర్హుఁడ సిద్ధవైభవ
శ్రీసుఖసుస్థిరాయువులఁ జెందగఁ బాత్రమ వై తనర్చుటన్.

53


సంక్షేపరూపం బగు నాదిసృష్టిప్రకారము

వ.

తత్ప్రకారంబునకుఁ బ్రారంభం బె ట్లనిన నఖిలేశ్వరుం డగుపరమాత్ముం డాత్మ
యోగంబున నాత్మయుం బ్రకృతియు నను తత్త్వమిథునంబు నిర్మించెఁ. బ్రకృతికి
మహత్తును మహత్తునకు నహంకారంబును నహంకారంబునకుఁ బంచ
భూతంబులుం బ్రభవించె. నాభూతంబుల వలన ననేక[2]భూతభేదంబు లుద్భూతంబు
లయ్యె. నిది సనాతనయైనసృష్టికి సంక్షేపంబు. తక్కినయవి దీనికి విస్తరావయవంబు.
లవి యెట్టి వనిన నవహితుండ వై యాకర్ణింపుము.

54


సీ.

అఖిలజగత్సృష్టి నాత్మ నపేక్షించి యాత్మోద్భవుండు నారాయణుండు
జలముల సృజియించి సమధికం బగు [3]నిజవీర్య మం దిడుటయు విస్మయముగ
విమలహేమాకృతి నమరుమహాండ మై కర మొప్పెఁ దద్భూరిగర్భమూర్తి
యై యుండి బహువత్సరాత్మకం బగుకాల మేగిన నది యవియించుకొనుచుఁ


తే.

బుట్టి యజుఁడు [4]క్రిందటివ్రయ్య భువియు [5]మీఁది
వ్రయ్య దివియును నడు మంబరంబుఁ జేసి

  1. యాదవోల్లాసి
  2. భూతంబు లిట్టి
  3. నట్టి
  4. క్రిందటిప్రక్క
  5. మీఁదిప్రక్క