పుట:హరివంశము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

హరివంశము


దిశలు కాలంబు మనసు బుద్దియును వాక్కు
గామరోషరత్యాదిసర్గము నొనర్చె.

55


వ.

మఱియు నతండు మరీచి యత్రి పులస్త్యుండు పులహుం డంగిరసుండు గ్రతువు
వసిష్ఠుండు ననువారి నేడ్వుర నుత్పాదించె. నమ్మహాత్ములు క్రియానిరతులుఁ
బ్రజాపతులు నై వెలసి. రాహిణ్య గర్భుండు నిజరోషంబున నంతకుం గలిగించె.
యోగవిద్యాప్రభుండుగాను సనత్కుమారు సృజించె. మేఘవిద్యుదింద్రధనువుల
నశనిరోహితనిర్ఘాతకేతువులఁ బర్జన్యపూర్వకంబుగాఁ బుట్టించె. ఋగ్యజుస్సామా
ధర్వణంబులు సంపాదించి యజ్ఞ[1]సిద్ధికిం బ్రతిష్ఠించి సర్వగాత్రంబుల ననేకభూతం
బుల నిర్మించె. నిట్లు ప్రవర్తిల్లిన సృష్టికి నభివర్ధనంబు గోరి.

56


క.

తన[2]మేని రెండుసగములు, వనితాపురుషులుగఁ జేసి స్వాయంభవుఁడన్
మనువును శతరూపాహ్వయ, మనుపత్నియుఁ గా నొనర్చె మహిమోజ్జ్వలుఁడై.

57


వ.

వార [3]లిద్దఱకుఁ బ్రియవ్రతోత్తానపాదులు జనియించి రందు.

58


సీ.

ధర్మునిసుతసూనృతాదేవి యుత్తానపాదునివలన సంపన్నయశులు
ధ్రువుఁ డనఁ గీర్తిమంతుం డనఁగాను నాయుష్మంతుఁ డన [4]మహాద్యుతి యనంగ
ననఘుల నలువురఁ గనియెఁ బుత్రుల నందు ధ్రువుఁడు నిర్మలనిష్ఠతోడ మూఁడు
వేలు దివ్యాబ్దముల్ వినుతతపంబు గావించి విరించి మెచ్చించి సప్త


తే.

మునులకంటె మీఁదై యొప్పుననుపమాన, సుస్థిరజ్యోతిరాత్మకస్ఫురితపదవి
వడసె సర్వగీర్వాణతపస్విసిద్ధ, సమితి యాశ్చర్యమునఁ దన్ను [5]సంస్తుతింప.

59


వ.

అట్టిధ్రువునకు శంభు వనుదానికి శ్లిష్టియు భవ్యుండును ననుకొడుకులు పుట్టిరి.
శ్లిష్టికి సుచ్ఛాయ యను సతి రిపు రిపుంజయ పుణ్య(ష్ప)వృకల వృకతేజసు లన
నేవురం గనియె. నందు రిపునకు [6]బృహతికిం జాక్షుషమనువు జనియించె.

60


క.

అతండు పుష్కరిణి యను, నాతికి వీరణసమాఖ్యనందనుఁ గనియెన్
బ్రీతి యెసఁగ [7]నడ్వల యసు, గోతి యతినివలనఁ గాంచెఁ గొడుకుల వరుసన్.

61


వ.

ఊరుండును బురుండును శతద్యుమ్నుండును దపస్వియు సత్యవాక్కును
గవియు నతిరాత్రుండును [8]నగ్నిష్టుత్తును [9]సుద్యుమ్నుండును నభిమన్యుండు
ననంబరఁగిన యాపదుండ్రయందును బెద్దవాఁడైన యూరునకు ఆగ్నేయియందు
గ్రమంబున నంగుండు సుమనుండు [10]ఖ్యాతి క్రతు వంగిరసుండును గయుండు
నన నార్వురు పుట్టి. రందు నంగుండు మృత్యుపుత్రి సునీథం బరిణయంబై వేనుం
డను కొడుకుం బడసె. నతండు.

62
  1. సృష్టి
  2. మేను
  3. లిద్దఱికి
  4. యశస్వంతుఁ డనఁగ?
  5. సన్నుతింప
  6. బృహస్పతికిం
  7. నుత్పల యను, నాతి యతనివలనఁ గాంచె నందనులఁ దగన్.
  8. అగ్నిష్టువును
  9. సత్యద్యుమ్నుఁడును
  10. స్వాతి