పుట:హరివంశము.pdf/499

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 8.

451

పార్వతీదేవి శ్రీకృష్ణునిఁ బ్రార్థించి బాణాసురునిచావు దప్పించుట

వ. విజయాసమన్విత యై యదృశ్యరూపంబునం దోడన చనియె లంబయు బాణున
     కడ్డం బై ముందటి చందంబున నిలిచెఁ బరమేశ్వరియుఁ గృష్ణున కొక్కనిక కాన
     వచ్చునట్లుగాఁ దన పొడవు సూపి యా[1]నగ్నశక్తికి సమాసన్న యయ్యె నప్పుడు
     చక్రధరుం డయ్యాదిమశక్తి నుద్దేశించి.211
క. ఈ వెడమాయము లేటికి, దేవీ యొనరించె దిట్టు దీనికి నెడగా
     నీ వొకటి యొడ్డి చూపినఁ, బోవఁగ నిత్తునె విరోధిఁ బొరిగొన కెట్లున్.212
వ. అనినఁ గాత్యాయని దైత్యారి కి ట్లనియె.213
ఉ. ఆదిజు నవ్యయుం బ్రభు ననాది ననంతు మహాత్ము సర్వభూ
     తోదయకర్త నిన్నుఁ బురుషోత్తముఁ దథ్యముగా నెఱుంగుదున్
     గా దన నేను నీ క్రియ కొకంటికి నైననుఁ దొల్లి పుత్రుఁగా
     నీ దితిజాన్వయుం గరుణ యిం పెసలార ననుగ్రహించితిన్.214
క. జీవత్తనూజఁగా నను, భావింపఁగఁ దగదె నన్ను బాణాసురునిం
     గావుము నాయత్నము వృథ, పోవఁగనీకుము త్రిలోకపూజితశౌర్యా.215
చ. అనుటయుఁ గృష్ణుఁ డి ట్లనియె నంబిక యీదనుజుండు బాహువుల్
     పెనఁగొన వేయు మోచి మదిఁ బెద్దయు మత్తిలి యుండు నిన్నియుం
     దునిమినఁగాని పాయదు సుదుర్దమదర్పము రెండుచేతులే
     నునుపఁగ జీవపుత్రతయు నొందెడు నీకు ననిందితస్థితిన్.216
క. ఆసురభావం బీతఁడు, పాసి భవత్సంశ్రయమునఁ బ్రతికెడు నీసున్
     రోసము నంతట నుడి గెడు, నేసిలుగునఁ బడక తొలఁగు మీ వనుడుఁ దగన్.217
వ. అదేవి సఖీసమేత యై లంబం దొలంగి రాఁ బనిచి యంతర్ధానంబు నొందె నంత
     నసురాంతకుండు.218
ఉ. ఇంచుక యడ్డపా టొదవె నింతన యంతయుఁ గంటి మంటి నే
     నంచు భవాదృశుం డకట యాఁటది గావ నొదుంగఁ బాడియే
     మించిన దర్పము న్మదము మిన్నకపోయెనె యిస్సిరో తుదిన్
     వంచన సేసినం బ్రిదులవచ్చునె నాదగుచక్రధారకున్.219
ఆ. చేటుదలకు బాణ చిక్కి నీమనసుతో, నిలువు మెందుఁ బోవ నేర్చె దింక
     ననుచు బెట్టు వైచె నతఁడు మహాఘోర, దర్శనంబు నాసుదర్శనంబు.220
వ. ఇట్లు కృష్ణకరవిముక్తం బై [2]ఖరకరసహస్రప్రభాచక్రంబునుం బోలె నమ్మహా
     చక్రం బడరం దదీయసంరంభంబున నఖిలభూతంబులు బ్రమసి చేష్టలు దక్కె
     ని ట్లడరి యా దివ్యసాధనంబు నిజతేజంబున దైత్యుతేజం బుపసంహరించి.221

  1. నగ్నశరీరిణి
  2. అలాతచక్రం