పుట:హరివంశము.pdf/480

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

432

హరివంశము

     వాపికాతీరంబులయందును గుమారు వెదకుం డనుచుం బనిచె నట్టియెడం దదీ
     యసేనాపతి యగు ననాదృష్టి యతని కి ట్లనియె.18
సీ. అధిప యింతయుఁ గాల మాత్మలోపలన యే నొకకార్య మూహించుచుండి నీదు
     మనసుచొ ప్పెఱుఁగక మాటగా వెడలంగ నది విన్నవింపంగ నయితి నిప్పు
     డవసరం బై యున్నయది కాన యాడెదఁ [1]బనిలేక వేల్పులపనికి నీవు
     కడఁగి దానవులఁ బెక్కండ్రం ద్రుంచి వారిపుత్రపౌత్రసహాయమిత్రవితతి
ఆ. సాలఁ గలదు పారిజాతంబు గొనునెడఁ, దొడరి వృత్రభేది నొడిచి తతఁడు
     గొంత మనసునందుఁ గొఱకొఱ గాకున్నె, యోట సైఁచునే మహోన్నతుండు.19
వ. నాకుం జూడ నీయపాయంబు వీరిలో నొక్కదెసం బొడమినది కావలయు నని
     రుద్ధహరణం బన్యులకుం బనియేమి విశేషించి యింద్రుండు దీనికిం గారణం బగు
     నని తలంచెద ననినఁ గృష్ణుండు నవ్వుచు నతనియాననం బాలోకించి.20
చ. అసురులచేఁతయే యిది సురాధిపు లక్కట దుష్టచిత్త లే
     యసదృశవిక్రమంబున సురార్థమగాదె నీరంతరంబు నీ
     వసుమతి నేను వర్తిలుట వారక యింత యెఱుంగరే సురల్
     పసగఁ బరోపకారులకుఁ బాప మొనర్తురె పుణ్యచేతనుల్.21
వ. నీ వెఱుంగక యి ట్లాడి తనిన నక్రూరుండును దదనురూపంబుగాఁ బలికెఁ గృష్ణుండు
     మఱియును.22
క, వినుఁడు పురుషు లెవ్వరికిం, బనిగా దనిరుద్ధుచనినభంగి జఱభి నాఁ
     జనునది యెవ్వతెయేనియు, ననురక్తి నటించి కొనుచు నరుగం బోలున్,23
తే. దైత్యదానవదేవసుందరులు మాయ, [2]లెన్నియేఁ జూపఁగా నేర్తు రెట్టివాని
     నైనలోఁతు రెక్కడనైన నధికగుప్తి, జొత్తు రరుగంగ వలఁతు రెచ్చోటికైన.24
వ. కావున మన మవ్విధంపుజాడ లరయింపవలయు ననియె నట్టివిచారంబున నయ్యం
     దఱు నున్నచోఁ గొన్నిదివసంబులకుం జారు లరుగుదెంచి సభాద్వారంబున యదు
     వీరవర్గంబు నెదుర నిలిచి వాసుదేవునకుం బ్రణమిల్లి దీనానను లగుచుఁ గరం
     బులు మొగిచి.25
క. దేవర యానతి యిచ్చిన, యావివిధస్థలములందు నన్యములందున్
     వేవిధముల వెదకితి మె, చ్చో వీరుఁ గుమారుఁ గానఁ జొప్పడదయ్యెన్.26
వ. ఇంక నెక్కడి కరుగుదు మెయ్యెడ రోయుదు మేమి యానతి యనిన నందఱు డెందం
     బులు గలంగం గన్నీరు నినిచి యొండొరుల మొగంబులు సూచి యెయ్యెది
     గర్తవ్యం బని యెప్పటియట్ల భిన్నప్రకారవిచారు లై రాదివసంబును రజనియు
     నవ్విధంబునన కడచిన.27
తే. భద్రతూర్యనాదంబులఁ బ్రకటసూత, మగధకీర్తనంబుల వందిమధురనుతుల
     మేలుకని కృష్ణుఁ డుచితసమీహితక్రి, యాకలాపంబు దీర్చి సమాదరమున.28

  1. బగ లేక
  2. లెన్నియేనియుఁ జాలంగ నేర్తు రెట్టి, వానినైన లోఁతెంతురు