పుట:హరివంశము.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 8.

431

     యపూర్వం బనుచు నొండొరుల కెఱింగించుచు యాదవు లెల్లను సంభ్రమం
     బున నసహ్యధిక్కారవిహ్వలంబు లై గహ్వరంబులు వెలువడు సింహంబులుంబోలె
     నొక్కెడ యాత్మమందిరంబులు వెలువడ నంతటిలోనన సభాపాలప్రహతం బై
     సంవర్తజలధరారావం బై భైరవంబుగా సన్నాహభేరి చెలంగిన.8

శ్రీకృష్ణబలరామప్రభృతు లనిరుద్ధునిపోకకుఁ గారణం బూహించుట

ఉ. ఆసభ కందఱున్ హరిహలాంకులు మున్నుగ వచ్చి పుష్పబా
     ణాసనుపట్టిపోక దెలియ న్విని యొక్కట శోకబాష్పని
     శ్వాసవివర్ణమూకవదనాంబురుహంబులతోడ విస్మయా
     యాసితమూర్తులై యొకకళాంతర మున్నెడ వారిలోపలన్.9
వ. వికద్రుం డను యదుముఖ్యుండు మురాంతకున కి ట్లనియె.10
మ. భవదీయోద్ధతబాహుపంజరమునం బర్యాప్తగుప్తంబు యా
     దవవంశంబ యనంగనేల దివిషత్పాలుండు నాభీలశా
     త్రవసంతాపశరణ్యుఁగా నిను మదిం దా నమ్మి [1]యుండం గడున్
     భువనేశుండవు నీవు నీకుఁ దగునే పోరామితోఁ జింతిలన్.11
క. అనిరుద్ధునిఁ [2]గానమికం, టెను నీ విబ్భంగిఁ జింత డిందుట గని నీ
     యనుఁగులు వగచెద రిందఱ, ననునయవాక్యములఁ దేర్పు మనఘవిచారా.12
వ. నీవు నీమనంబున నొక్కింత దెలిసి చూచినం దోఁపని తెరువులు లేవు గుమారు
     పోక యూహించి తగిన యుద్యోగంబు వాటింపు మూరకయుండుట తగ దనిన
     నీషదుల్లాసవిశదవదనుం డగుచు నంబుధిసదనుం డి ట్లనియె.13
క. పాపనిపోయినతెరు వే, నోపి యరసి చక్కఁబెట్టకున్నను జను లా
     రోపింతురు నాపై నొక, యోపమి యటుగాన చింత నొందఁగ వలసెన్.14
తే. చిఱుతనాఁడు ప్రద్యుమ్నుని గఱకుటసుర, గొనుచుఁ బోయిన పోకడ గనుట లేక
     యేము వగవంగ రిపుఁ జంపి యెలమి నతఁడు, దాన యేతెంచి తఱిగె మత్పరిభవంబు.15
ఉ. ఈతనిచందముం దలఁప నిట్టిద వైరులు వేగ నుగ్రులై
     నాతలపై సభస్మచరణం బిడిపోయిరి గాక యల్పమే
     యీతెఱఁ గేమి సేయుదు నుదీర్ణబలంబున నీనికారమున్
     వే తొలఁగింతుఁ ద్రోవ గనువెంటకుఁ జూడుఁడు మీ రుపాయముల్.16
క. అనవుడు సాత్యకి దేవా, పనుపుము బహుజనుల నరయ బహుభూముల కెం
     దును బహుభంగుల నరయఁగఁ, గనియెదము కుమారు నరసి కాదే చేఁతల్.17
వ. అనిన నుగ్రసేనుం డది యట్టిద యరయక యెఱుఁగవచ్చునె యిప్పనికి నాలస్యం
     బేల యనుమాటకు మాధవుండు రథచారుల నశ్వచారులం బాదచారుల
     నాక్షణంబ యనేకులం బిలుపించి రైవతంబు లతావేష్టంబు ఋక్షవంతంబు నను
     పర్వతంబులయందును వివిధోద్యానవనంబులయందును నదీప్రస్రవణవేశంతసరో

  1. యుండం దగన్
  2. గాన కిట్లీ, వొనరఁగ నీభంగిఁ జింతనొందుఁ గని నీ