పుట:హరివంశము.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 4.

323

వ. సంయమిపుంగవులు సమ్మోదలీలావికసీతాకారు లై యమ్మహావీరు వీరరసోత్సేకం
     బనేకభంగుల నభినందించి మఱియును.104
మ. అనుకూలస్థిరలీలమై నఖిలలోకాత్యంత[1]దుఃఖావమో
     చనకృత్యంబున కర్థితోఁ గడఁగు యుష్మద్విక్రమప్రక్రమం
     బనపాయంబు [2]నపేతనిఘ్నమును నై యాఢ్యం బగుం గాత యెం
     దును ధన్యం బగుఁ గాత ధర్మ మిరవొందుం గాతఁ గల్యాణముల్.105
వ. దేవా యేము వోయి వచ్చెద మని యమ్మహానుభావుచేత వీడుకోలు వడసి యం
     దఱును శిష్యసహితు లయి యాప్రొద్ద కదలి బదరికాశ్రమంబునకుం జనిరి. ఇక్కడ
     నశేషయాదవులును మునిసమాగమంబునం బ్రకటం బైన కృష్ణమాహాత్మ్యంబు
     గొనియాడుచు విస్మయంబు నొందుచు నతండునుం దారును నరకాసురవధంబు
     నకు నుద్యోగంబు చింతించుచున్న సమయంబున.106

ఇంద్రుఁడు ద్వారకానగరంబునకు వచ్చి కృష్ణునిఁ జూచుట

సీ. ఆకాశగంగోర్మిశీకరంబులు మోచి మందారసౌరభస్యంది యగుచు
     నమరవిమానగత్యనుకూలమై లీల దివ్యవాయువు చనుదెంచెఁ దోన
     గురిసె దేవోద్యానతరుపుష్పవర్షంబు ఖచరకోలాహలకలనతోడ
     [3]ననిమిషహృద్యవాద్యారావములు మించె నాలోనఁ దోతెంచె నంబరమున
తే. నతిమనోహరతేజోమయప్రపంచ, మంచితార్కతేజస్ఫూర్తి ననుకరించి
     యాగ్రహంబున సకలజనావలోక, నీయబహుమూర్తు లై ధాత్రి నిలిచి వెలసె.107
వ. ఆమూర్తి సముదయంబునందు.108
మ. రజతాద్రిప్రతిమాన మై చను చతుర్దంతోజ్జ్వలాంగస్ఫుర
     ద్గజరత్నంబుపయిన్ సవజ్రకరుఁ డై కల్యాణముక్తామణి
     వ్రజభూషామహనీయదివ్యవసనస్రగ్గంధవిస్ఫూర్తితో
     ద్రిజగద్భర్త శచీవిభుండు వొలిచెన్ దేదీప్యమానోన్నతిన్.109
ఉ. ఆతని సూ రెలం దమ సమంచితయానము లుల్లసిల్ల న
     త్యాతతవైభవంబు లెలరార నలంకృతు లై దిగీశ్వరుల్
     ప్రీతిఁ దనర్చి రెంతయును బెంపునఁ దక్కును గల్గుదేవతా
     జాతము నొప్పె నప్డు దమ సన్నహనంబులతోడ నచ్చటన్.110
వ. ఇవ్విధంబునం జను దేంచిన దివిజపాలుర నాలోకించి నీలవర్ణుండు నీలాంబరసహి
     తంబుగాఁ బ్రత్యుత్థానం బొనర్చి బాంధవులుం దానును నెదుర్కొనియె నమ్మహేం
     ద్రుండును గజేంద్రావతరణంబు సేసి నిజవాహనావతీర్ణు లగు త్రిదశులు వొదివి
     కొని రాఁ గదిసి ముకుందుం దొలుతం [4]గౌఁగిలించి తదీయాగ్రజు నుగ్రసేనుం
     గ్రమంబున నాలింగనంబు గావించి, ప్రద్యుమ్నకుమారు నిరుగేలం గ్రుచ్చియెత్తి

  1. దుఃఖోప
  2. నవీత
  3. ననిమిషాలోడ్యహృద్యారవంబులు ; . . . నృత్యారవంబులు
  4. గవుంగలించి