పుట:హరివంశము.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

276

హరివంశము

     బుల పెల్లును బగతుని యద్భుతజన్మంబును నూహించి యూహాపోహవిచక్షణుం
     డగు పుండరీకాక్షుం డక్షణంబ బంధువుల నందఱ రావించి యత్తెఱం గెఱింగించి.124
క. ముక్కంటివరంబున మన, కెక్కుడుభయ మావహించె నీతఁ డవధ్యుం
     డక్కజుఁడు పగతుఁ [1]డద్దెస, నెక్కొని [2]సిద్ధింప వెట్టి నెఱిఁ గర్జములున్.125
తే. సామదానకర్మములవశంబు సేయ, రాదు దుర్దాంతదోర్దర్పరభసశాలి
     కడిఁది బిరుదు కయ్యమునక కాలుద్రవ్వు, నాతఁ డిది యేను నారదుచేత వింటి.126
వ. వీనికి నెదిర్చి పొడిచితిమేనియు జరాసంధుండు మనమీఁద బద్ధవైరుండు కంస
     వధంబున నస్మద్విరోధు లగు రాజులందఱు వానివారై వృష్ణివీరులతోఁ బెక్కు
     మాఱులు పెనంగినవారు వీరందఱును వచ్చి వీనిం గూడిన జయం బతిదుస్తరం
     బగు ముందటి బవరంబునను మనవారు బలుమానుసులు పలువురు మడిసిసవా
     రిప్పురంబునన యుండితి మేని నిర్వహింప శక్తులము గాము గావునం దొలంగి
     పోవలయు నని నిశ్చయించి యందఱం గదల్చి యనంతరంబ.127
తే. కాలసర్పంబు నొక్కటిఁ గడవఁ బెట్టి, వాయి గట్టి ముద్రించి యవ్వాసుదేవుఁ
     డొక్కదూతచే నిచ్చి యయ్యుగ్రరిపుని, పాలి కంతయునదురుగాఁ బనుచుటయును.128
క. చని [3]వాఁడు యవననాథునిఁ, గని ననుఁ బుత్తెంచె నధిప కమలోదరుఁ డా
     ఘనతేజు వాక్య మొక్కటి, విను మేర్పడ సావధానవృత్తి యెలర్పన్.129
చ. మిడుతలపిండువోలెఁ గడుమిక్కిలిగా బలుమూఁకఁ గూర్చి యి
     ట్లడరితి నీవు దావదహనాకృతిఁ గ్రాలెడుమత్ప్రతాప ము
     గ్గడు వగు[4]చంద మేమియును గానవు కాలునికోఱ యూఁదఁగాఁ
     దొడఁగుట గాదె నాకు భుజధుర్త సూపఁ గడంగు టెమ్మెయిన్.130
ఉ. ని న్నవలీలఁ బోలె నొకనేర్పునఁ జిత్రము గాఁగఁ ద్రుంచి యి
     ట్లున్న భవద్బలౌఘమున నొప్పుగజాశ్వరథోత్తమంబులం
     గ్రన్నన నేన యన్నియును గైకొని యేలెద నీసహాయులై
     చెన్నెసలారువీరు గతచేష్టత నల్దెసఁ [5]దూలి పాఱఁగన్.131
వ. అనిచె నని పలికి దూత యతనిముందటఁ దనతెచ్చిన సర్పకుంభంబుఁ బెట్టి
     కృష్ణుండు కృష్ణోరగదారుణుం డని రోషవిషంబు నిరౌషధం బివ్విధం బెఱుం
     గుదో యెఱుంగవో యని దృష్టంబు గావించుటకై యాదవు లివ్విధంబున ఘటి
     యించి పుత్తెంచి రనుటయుం గాలయవనుం డేమియు ననక నవ్వుచు.132
క. పెనుజీమలఁ బెక్కిటిఁ జ, య్యనఁ దేరఁగఁ బనిచి యమ్మహాహిఘటములో
     నినిచి మగుడ నిజముద్రా, వినిబధ్ధము చేసి పుచ్చె విష్ణునికడకున్.133

  1. డట్టిఁడ
  2. సంధింప
  3. యతఁడు
  4. నంద మేమి
  5. జూచి