పుట:హరివంశము.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 2.

275

     నయ్యూర్ధ్వరేతస్కు నన్యుఁ డొక్కఁడు వచ్చి యదుకోటిసన్నిధి నపహసించి
     యీతఁ డాఁటది గాక యెన్నంగఁ బురుషుఁడే యని యెగ్గు పలుకంగ నవ్విధంబు
తే. వినియు నూరకుండిరి యదువీరు లతఁడు, ప్రకటరోషవిజృంభితభావుఁ డగుచు
     [1]నడవి కేఁగి పండ్రెండేఁడు లధికనిష్ఠ, [2]లోహచూర్ణాశి యై నిర్విలోపబుద్ధి.114
వ. ఘోరవ్రతంబు నడపినం బ్రీతుం డై తోతెంచి పినాకి వరం బడుగు మనిన నతండు
     వృష్ణ్యంధకభయావహుం డగు తనయుం(డు గావలయు నని) కోరుటయుం
     ద్రిలోచనుం డట్ల యొసంగె నట్లు లబ్ధవరుం డగు నమ్మహాతుని తెఱం గెఱింగి
     యవనేశ్వరుం డపుత్రకుం డగుట బుత్రార్థి యై యతనిం బ్రార్థించి తోడ్కొని
     పోయి.115
తే. ఆలమందలో నునిచి నిత్యార్చనంబు, సేయుచుండంగ నప్పరస్త్రీ యొకర్తు
     గోపకామినీరూపయై కొఱలి యతని, వలన గర్భంబు దాల్చె నీశ్వరునియాజ్ఞ.116
క. ఆగర్భంబునఁ బుట్టె మ, హాగురుతేజుండు కాలయవనుఁ [3]డనఁగ బా
     హాగర్వవిజితవిమతో, ద్యోగుఁడు ధీగణ్యుఁ డధికదుర్దముఁ డెందున్.117
తే. అతనిఁ బుత్రుఁగాఁ గైకొని యవనవిభుఁడు, పెనిచె [4]నంతిపురంబునఁ బెనుపు మిగులఁ
     దత్పరోక్షంబునం భూతలవిభుత్వ, మొంది యౌవనగర్వమహోగ్రుఁ డగుచు.118
వ. అతం డెవ్వరిం గైకొనక క్రాలుచుండి యొక్కనాఁడు నారదుం డరుగుదెంచిన
     వినతుం డై వీరు లగువారి నడిగిన నమ్మునీంద్రుండు.119
క. యాదవు లుల్లోకభుజ, శ్రీదర్పసమగ్రు లని విశేషోక్తుల నా
     వేదించినఁ దత్క్షణ మా, త్రోదిత మగుమత్సరమున నుల్లము వొదలన్.120
వ. [5]శకధరాపాలురును హిమశైలాశ్రితు లగు దస్యులుం దనకు విధేయులు గావున
     నందఱం గూర్చి యప్రమేయగజవాజిఖరోష్ట్రంబులు గల నిరవధికసేనాసముద
     యంబులతో మధురపైఁ దోతెంచు సమయంబున.121
మ. ధరణీచక్రము గ్రుంగి దిక్కరటిసంతానంబు పై డింద ని
     ర్భరభారాతురభోగిరాట్ఫణతతుల్ మ్రగ్గంబడం గూర్మక
     ర్పరభేదంబునఁ దూలి బిట్టు సక బ్రహ్మాండముం గంపముం
     బొరయన్ దుస్స్థితి నొంద భీభరపరాభూతంబు లై భూతముల్.122
తే. అడవు లడఁచి కొండలమీఁద నడరి యఖిల, వారినిధులను బిండలివండు సేసి
     కమలహితు మ్రింగి దెసలఁ జీఁకట్లు గొలిపి, పరఁగె యవనసైన్యోత్థితబహుళరజము.123
వ. అయ్యవనేశ్వరు విడిచలల నశ్వఖరోష్ట్రమూత్రపురీషస్రావంబులవలన సంభూత
     యై యశ్విశకృత్తనుసరిత్తు సాగరంబు నధిగమించె న ట్లేతెంచు నభియాతి సైన్యం

  1. నడవి పండ్రెండేండ్లు నది
  2. లోహచూర్ణాశినిర్విషమోహబుద్ధి.........లోపబుద్ధి
  3. డుఘన
  4. నంతఃపురంబున
  5. శకదరదపారదులును (సం. ప్ర.)