పుట:హరివంశము.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము ఆ. 2.

277

వ. ఇత్తెఱం గాలోకించి యాలోకోత్తరవివేకుండు బలీయుం డయ్యు నొక్కరుం
     డల్పులు వెక్కండ్రు వొదివినం జిక్కువడుటకు నిదర్శనంబుగాఁ బ్రతిపక్షుఁ
     డొనర్చిన యుత్తరంబుగాఁ గైకొని తడయక మధురాపురంబు విడిచి చని.134
చ. జలనిధితీరకాననవిశాలతలంబులఁ బౌరబాంధవా
     వళులఁ దగంగ నున్చి యనవద్యవిచారుఁడు పాదచారి యై
     వెలయఁగ నొక్కఁడున్ రిపుని వీ డవిశంకతఁ జొచ్చె నమ్మహా
     బలుని నిరాయుధుం గని విపక్షులు విస్మయమగ్నచిత్తు లై.135
తే. వీఁడె కృష్ణుఁడు కృష్ణుఁడు వెసఁ బొదువుఁడు
     పట్టుఁ డని యెండుఁ గలఁగంగఁబడఁగఁ గాల
     యవనుఁ డంతలోఁ దానును నపగతాయు
     ధుఁడుఁ బదాతియు నై [1]సముద్ధురతఁ గడఁగె.136
క. చేయీక వాని మొనలకుఁ, బాయఁగ నెలయించి దవ్వు పఱచె నవధ్యో
     [2]పాయుఁడు హరి యడుగడుగుం, జేయందినయట్ల యాససేయుచు వీఁకన్.137
వ. ఇ ట్లరిగి తొల్లి మాంధాతృనందనుండు ముచికుందుం డనువాఁడు దేవాసురసమ
     రంబున నమరులకయి పెద్దకాలంబు కయ్యంబు సేసి జయం బొసంగి ప్రీతు లగు
     నాదితేయులచేత నాత్మశ్రమాపనోదనార్ధంబు సుఖసుప్తిఁ గోరి నిద్రావిఘ్నం బొన
     ర్చినవాఁడు తనచూడ్కిన సమయుట వరంబుగాఁ బడసి యొక్కపుణ్యశైల
     గుహాంతరంబునం బరార్థ్యతల్పంబున నునికి యఖిలార్థవేది గావున నెఱింగి
     యద్దేవుండు.138
తే. అట్టియా[3]లోన కడురయం బారఁ జొచ్చి
     యొయ్యఁ దలయంపిదిక్కున నొదిఁగి యుండెఁ
     బగతుఁడును వెనువెంటన పాఱుతెంచి
     కనియె నిద్రాయమాణు నమ్మనుజనాథు.139

కాలయవనుండు ముచికుందుని రోషానలంబున భస్మీభూతుం డగుట

చ. కని కమలాక్షుగాఁ దలఁచి కైకొన కేపునఁ గాలఁ దన్ని చా
     వునకుఁ దొలంగ నిట్టివెరవుం దలపోసి యడంగియున్నఁ బో
     వునె వెస లెమ్ము యాదవ యవున్ భవదీయబలంబు గంటి మే
     మని ప్రకటాట్టహాసకఠినాకృతితోడ నదల్చి నిల్చినన్.140
క. మేలుకని నిద్ర సెడుటకుఁ, జాలఁగ రోషము జనింప జనపాలుం డా
     భీలాలోకనమున బి, ట్టాలోకించి యవనేశు నధికోద్వృత్తిన్.141

  1. యనుద్ధురత
  2. పాయంబున
  3. గోత్రగుహ రయమార; లాగ తగ రయమార.