పుట:హరివంశము.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ.8.

205

     తుండై యతని నభ్యంతరగృహంబునకుం దోడ్కొని చని యథోచిత ప్రతిపత్తి
     యాచరించె నయ్యక్రూరుం డతిక్రూరశిక్షకుం డగు పుండరీకాక్షు సాక్షాత్పరిరంభ
     ణంబున నపగతరోషుం డై తద్గోష్ఠంబునఁ దత్కృతపరిపూజనంబునం బ్రాప్త
     సుకృతసంగ్రహగరిష్ఠంబును దదాలోకనాదరంబున విగళితమోహంబును నగు
     నిజదేహంబు మాహాత్మ్యంబునకు భోజనంబుగాఁ గృతప్రయోజనం బగుజననం
     బునం బరగిన వానింగాఁ దన్నుం దలంచుచు నాక్షణంబ నందగోపాదిగోపాలుర
     నందఱ రావించి.143
మ. తనసంపూజ్యశరాసనంబునకు [1]నుత్సాహంబుతో నుత్సవం
     బొనరింపంగఁ గడంగెఁ గంసుఁ డురుబాహుం డోలి మీమీయరుల్
     గొని రం డామేఱకున్ ఘృతప్రముఖముల్ గూడంగఁ దెం డింతప్రొ
     ద్ద నెఱి న్వెల్వడి యేఁగుఁ డమ్మధుర కు[2]ద్యత్ప్రీతి సంధిల్లఁగన్.144
వ. ఆ రాజపుంగవుం డీరామదామోదరుల నుదారవీరవ్రతధౌరేయు లనఁగా విని
     యుండుం గావున నమ్మహోత్సవకాలంబున వీరిం గనుంగొనువేడుక నిట పుత్తెంచె
     రేపు రథారూఢులం జేసి తోడ్కొని పోయెద మీరు ముందరఁ గదలుం డని
     చెప్పె నంత నుచితక్రియానంతరంబ.145
మ. అతఁడుం దానును నొక్కబంతిన విచిత్రాహారము ల్గోరస
     ఫ్లుతిహృద్యంబుగాఁగఁ గైకొని దయాలోలాత్ము లారోహిణీ
     సుతదామోదరు లొక్కచోటన మహాశోభాఢ్యశయ్యోపరిం
     జతురప్రీతి శయించి కార్యకథనాసంసక్తిమై నున్నెడన్.146
వ. ఆ రహస్యస్థలంబున నక్రూరండు దనుజారి కి ట్లనియె.147
మ. జననింబుట్టినయప్డు పాసి యడవిన్ జాత్యంతరాభాససం
     జనితం బైనలఘుత్వ మి ట్లొలయఁగా సంవృద్ధిఁ బ్రాపించి నీ
     వనఘా క్రీడలు సల్పి తింక వల దీవ్యాసంగ మాత్మీయమై
     చనువంశంబును శీలముం గడుఁబ్రకాశం బొందఁజేయం దగున్.148
మ. యదుభోజాంధకకోటికెల్ల నొడయం డాకంసుఁ డారాజుపం
     పు దగం జేసినవాఁడవై మధురకున్ భూరిప్రమోదంబుతో
     యదువీరోత్తమ రమ్ము కార్ముకమహావ్యాజంబునం బేర్చుత
     ద్విదితశ్రీవిభవం బపూర్వగరిమన్ వీక్షింపు పెం పేర్పడన్.149

అక్రూరుఁడు శ్రీకృష్ణునితో దేవకీవసుదేవులపరితాపంబు చెప్పుట

వ. అటమీఁద నెయ్యది కర్తవ్యం బది నీవ యెఱింగెద వింక నొక్కం డాకర్ణిం
     పుము.150

  1. మోదం బారఁగా
  2. ందత్ప్రీతి