పుట:హరివంశము.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము . ఆ. 6

153

శ్రీకృష్ణుఁడు రాక్షసాంశసంభూతంబు లగు సప్తవృషభంబులఁ జంపుట

తే.

 అన్న యి ట్లేల సాహసం బనుచు నంద, గోపుఁడును యశోదయును సంక్షోభ మొందఁ
గుంభకుఁడు మెచ్చఁ దక్కిన గోపకోటి, సంశయింప ససంభ్రమోత్సాహలీల.

159


వ.

ఆయుగ్రపశువుల కభిముుం డయ్యె నప్పుడు దేవతలు మునులు నంబరతలం
బుననుండి యతని విజయంబు గోరుచుఁ గనుఁగొనుచుండి ర ట్లడరి యవ్వీరుండు
ఘోరంబుగా నదల్చి.

160


క.

ఖలులార యింత కాలము, గలఁచితిరి ధరిత్రి బ్రాణిఘస్మరులు పశు
చ్ఛలనాఛన్నవికారులు, పొలిసితి [1]రిఁక మీకు నెందుఁ బోవఁగవచ్చున్.

161


క.

నాపిడికిటికడిఁదిపిడుగు, నాపగిదియ దీనఁ దగిలి యంతకుఁడైనన్
రూపు సెడకుండఁ జాలునె, యీపాపాత్మకుల మిమ్ము నేల సహింతున్.

162


మ.

అని యావిష్కృతతీవ్రముష్టి యగుచున్ హాసోజ్జ్వలాస్యంబునం
గన లుప్పొంగఁ గడంగునవ్విభుఁ ద్రిలోకక్షేమనిర్వాహకుం
గని పూర్వం బగువైరబంధమున నుగ్రక్రోధులై ధూర్తగో
దనుజుల్ మార్కొని రొక్కయుమ్మడిన యుద్యద్గర్జతో నేడ్వురున్.

163


వ.

అట్టికోల్తలయందు.

164


సీ.

పొదివిన నందంద మొదుకనియఱచేత వీఁకతో మోరలు వ్రేసివ్రేసి
పిఱువోవ నందంద తఱిమి కొమ్ములు వట్టి తొడరి నొండొంటిపైఁ ద్రోచిత్రోచి
చెదరిన నవలీలఁ జెనసి యొక్కొక్కటి తెరలఁ దోఁకలు వట్టి త్రిప్పిత్రిప్పి
తిరిగినఁ బోనీక పరిగొని యన్నింటి నదరంట పొరిగొని యాఁగియాఁగి


తే.

[2]ముట్టి గండముల్ వడిఁ గత్తిపెట్టు వెట్టి
వీఁపు లడిచియు దోఁకలు వీఁకఁ దాఁచి
[3]రావెన్నుఁ డక్కడివారికి వెఱుఁగు గాఁగఁ
గడిమి నాఁబోతుగమి బెట్టు గలఁచి యాడె.

165


వ.

ఇట్లు చూపఱచూడ్కికి వేడ్కగా గొంతదడవు వినోదించి.

166


శా.

నీళాలోకనరోచు లాదరసమున్నిద్రంబులై సిగ్గునం
జాలన్ స్రుక్కుచు నొయ్యనొయ్యఁ దను నాసం జెంది యానందక
ల్లోలవ్యాహతిఁ దూలఁ దత్కుతుకము ల్పూరింప నుద్యుక్తుఁ డై
యాలోకప్రియుఁ డవ్విరోధులఁ బ్రచండాలోకుఁడై చూచుచున్.

167


ఉ.

దిక్కరిహస్తదండసముదీర్ఘభుజుండు ప్రగాఢముష్టి నొ
క్కొక్కనిమ స్తకం బవియ నొక్కొకపోటు గొనంగఁ గన్నులన్
ముక్కున వాత నెత్తురు సముద్ధురమై చెదరంగ నోలి తో
నొక్కొకరుండ కూలి రుసు ఱొక్కట పోవఁగఁ గాలనేమిజుల్.

168
  1. రెటయింక
  2. ముట్టికందములనుగత్తి (పూ. ము.)
  3. వెన్నెముక లన్ని చెఱుకులవ్రేఁగు గాఁగ. (ఫూ. ము.)