పుట:హరివంశము.pdf/202

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

హరివంశము


శా.

ఈయాఁబోతుల నిట్లు బెట్టుగొన నిం కేనాటి కీవిక్రమ
వ్యాయామంబులకల్మి చూడుఁ డిదె కన్నారంగ నన్నొక్కనిన్
వేయుం బల్కఁగ నేల నుక్షముల నుర్విం గూల్తు నన్నింటి వీం
[1]డ్రా యస్మద్ భుజవజ్రపాతనకు గోత్రాభంబు లై చేకుఱన్.

149


మ.

అని యాస్ఫోటితబాహుఁడున్ బహులసింహధ్వానదీప్తాననుం
డును దర్పోద్ధతవిగ్రహుండు నయి యాటోపంబుతోడం గడం
గిన నయ్యుక్షము లీక్షణచ్ఛటల నగ్నిజ్వాల లొక్కుమ్మడిం
గనలం గన్గొని వానిపైఁ గదిసెఁ దీక్ష్ణవ్యూఢశృంగంబు లై.

150


తే.

పొదలుఁ బుట్టలు గట్టులు భూరుహములు, నెక్కి కనుఁగొను జనకోటియెల్లఁ బొగడు
నట్లు గడఁగి యావ్రేఁడు లాపమరఁ బొడిచెఁ, జిక్కఁబిడికిట నొకపోతుశిరమునడుమ.

151


శా.

ఈతం డేఁటికి నిమ్మెయిం గడఁగె ని ట్లేలొక్కొ యీదుష్టుటాఁ
బోతు ల్వోవఁగనిచ్చునే యనుచు నంభోజాక్షుచిత్తంబు చిం
తాతిక్రాంతము నొందఁగాఁ బొదివి తా నాభంగి దోర్విక్రమ
ఖ్యాతిం జూపినఘోషవంతుఁ బొదివెన్ గ్రందంగ నయ్యన్నియున్.

152


తే.

పొదివి నిడువాలుగొమ్ములఁ బొడిచి యెత్తి, ధరణిపై వైచి వెసమెట్టి ఖురపుటములఁ
జిమ్ముటయు దవ్వుగాఁ దూలి సొమ్మవోయి, పడియె నాతండు సూపఱు భయము నొంద.

153


వ.

ఇట్లు ఘోషవంతు బెట్టిదంపుటురవడి ధరణిం బెట్టి యయ్యుగ్రపశువులు దక్కునుఁ
గల పశుపాలకప్రకరంబు పైకి నడరి.

154


క.

కొందఱఁ గొమ్ముల గ్రుచ్చెం, గొందఱ నిలమీఁదఁ బెట్టి గొరిజల మెట్టెన్
గొందఱ [2]దౌడల నమలెం, గ్రందుగఁ బెఱజనము లెల్లఁ గనుకనిఁ బఱవన్.

155


వ.

అంతయుం జూచి మందహాసవిభాసితాస్యుం డగుచు వాసుదేవుండు బలదేవుతో
నల్లన యిట్లనియె.

156


మ.

ఇవి యాఁబోతులు గావు గోవృషములం దీరోష మీదోష వి
ప్లవ మీసర్వజిఘాంస యారయ నసంభావ్యంబు వమ్మయ్యె నీ
భువిలో నేచినగోపవిక్రమకళాస్ఫూర్తు ల్లసత్కీర్తి నా
కవుఁగా కిప్పుడ కాచెదన్ [3]వృషభయవ్యాదిద్ధు నిక్కుంభకున్.

157


వ.

తొల్లి తారకామయసంగ్రామంబున నాచేత నిహతు లైనకాలనేమిపుత్రు లేడ్వురు
నీరూపంబులం బుట్టి నాకుఁ గీడు సేయం గోరి తిరిగెదరు రిపువధం బవశ్యకర్త
వ్యంబు బంధురక్షణసుకృతం బొక్కటియుఁ గన్యాకరగ్రహణలాభంబును శోభ
నంబులు గావె శ్రీధాముతోడిసఖ్యంబును నాకు నపేక్షణీయం బిది నాతలంపు
నీవు నిశ్చింతుఁడ వై యుండుమని యతం డనుమతింప నాక్షణంబ సన్నద్ధుం డై.

158
  1. జుం డాయత్తాద్భుతవజ్రపాత
  2. రాపుల నలిపెన్
  3. గృపభయవ్యావిఘ్ను