పుట:హరివంశము.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 6

143


గోగణంబులం గొనుచుం జని యిమ్ముల నిలిచె నతనిమతం బెఱింగి మఱియునుం
గొందఱు గోపాలకు లచ్చోటిక యరిగి యరోగు లై రట్టియెడరునందు.

50


తే.

ఏను జుట్టంపుజనులను నెందువోదు, మిచ్చటన యుండఁగా నేమి వచ్చెనేని
ననుభవింతుము గాకని చనక నిలిచె, నందగోపుఁడు దానును సుందరియును.

51


క.

తల్లియుఁ దండ్రియు నిమ్మెయి, నిల్లు వెడల కధికరోగహృతచేతసులై
తల్లడిలుట విని కృష్ణుఁడు, పుల్లవడి [1]తలంకుచుండె బుద్ధిని నచటన్.

52


వ.

ఇట్లు బలదేవకేశవులు బలిష్ఠు లయ్యు నయ్యుపద్రవప్రతికారంబునం దసమర్ధు లై
యుండ నా వ్రేపల్లె యందు విదేహదేశాగతుం డై యున్న గోపవృద్ధుం డొక్క
రుండు గోపముఖ్యుల నెల్లం గూడం బిలిచి వారితోడ.

53


సీ.

పశుసమాశ్రయమున బ్రతుకుచున్నారము మనము దత్పశుసంఘమునకుఁ బ్రభుఁడు
వృషకేతనుం డగువిషకంఠుఁ డద్వయుఁ డటుగాన సద్భ క్తి నమ్మహాత్ము
నర్చింపఁగా శాంతి యగు నెల్లవిధముల వేదపారగు లైనవిప్రవరులు
బిలిపించి శాస్త్రసంభృతయుక్తికల్పితమార్గంబుతో దేవమందిరమునఁ


తే.

దొడగుఁ డీయనుష్ఠానంబు జడత యుడిగి, యనినఁ గులవృద్ధుమాటకు నాత్మలందుఁ
దద్ద విశ్వాస మొలయంగఁ దత్క్షణంబ, గోపు లెల్ల ను దగువస్తుకోటి గూర్చి.

54

గోపాలకులు రోగశాంతికై శివపూజావ్రతంబు సలుపుట

వ.

శివభక్తియుఁ దదీయతంత్రజ్ఞానంబును దదాచారధుర్యతయుం గల యార్య
ద్విజోత్తములఁ బ్రార్థించి తెచ్చి తత్క్రియా[2]నిర్వాహత్వంబునకు నియోగించిన
నమ్మహాత్ములు విహితోపవాసనియమసమాహితు లై తత్సమీపస్థితం బగుసిద్ధ
స్థానంబునందు.

55


తే.

[3]ఎలమి ఋత్విక్కులను వరియించి కుండ, మండలోదారపూర్వకమహితతంత్ర
మతిశయిల్లఁగ ద్రవ్యంబులందు శుద్ది, వెలయ నధివాసనాదులు దొలుతఁ జేసి.

56


సీ.

పంచామృతంబులఁ బంచగవ్యంబుల విమలోదకంబులఁ గ్రమముతోడ
నభిషేక మొనరించి యఖిలేశ్వరుని సమంచితగంధసమితి నర్చితునిఁ జేసి
భూరిసౌరభచారుఫుష్పదామంబులఁ బూజించి బహువిధస్ఫురితధూప
తతి యిచ్చి కపిలాఘృతప్లుతవర్తికారమ్యదీపముల నారతు లమర్చి


ఆ.

భక్ష్యభోజ్యలేహ్యపానీయబహుళనై, వేద్యములు ఘటించి హృద్యలీలఁ
బగలు రేలు నట్లు పరిచర్య నడపుచుఁ, గొలిచి రేడుదివసములు గ్రమమున.

57


క.

తగ నిప్పగిదిని దప్పక, నగజాస్కందులను వృష,భనందీశుల స
ర్వగణాధ్యక్షు వినాయకుఁ, బ్రగుణార్చనముల భజించి భావించి రెదన్.

58


తే.

ఉత్తమం బగుశివమూర్తియుత్తమాంగ, మున నతిస్థూలఘృతధార లనవరతము
దొరుఁగుచుండెను మూఁడునధ్వరదినంబు, లన్నిటను విప్రవిహితప్రయత్ననిష్ఠ.

59
  1. వడంకు
  2. నిర్వాహకంబునను
  3. ఋత్విగాచార్యతతి. (పూ. ము.)