పుట:హరివంశము.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

హరివంశము


వ.

అగ్నిప్రతిష్ఠ గావించి ఋత్విజులు వాగీశ్వరసంభూతం బగు [1]శివాలయంబునందు శివ
సంహితామంత్రంబుల నాజ్యపాయసాపూపప్రముఖంబుల హోమించి రయ్య
యివిధంబున నెల్లవారును మృత్యుపరిహారకంబు లగుమంత్రజపంబులు నుపద్రవ
శమనకారు లగుమహా దేవమంత్రస్తోత్రపఠనంబులు శాంతిప్రదంబు లగు కల్యాణ
ధ్యానంబులు ననుష్ఠించుచుండిరి పరమేశ్వరుముందరఁ గొందఱు భ్రూవిక్షేపం
బుల నక్షివివర్తనంబులం జరణతాళంబుల హస్తవిన్యాసంబుల నతిమనోహరం
బును గుతూహలావహంబును నగుభక్త్యావేశనర్తనంబు ప్రవర్తించి ప్రదక్షిణ
ప్రణామాదు లొనరించి రిట్లుండ నేడవునాఁటి మధ్యాహ్నసమయంబునందు.

60


శా.

ఆవిప్రావళిలోన వేదముల వేదాంగంబులం గోవిదుం
డై వర్తిల్లుమహాద్విజుం డొకఁడు భూతావేశముం బొంది తీ
వ్రావష్టంభముతోడ నొత్తిలి మహాహాసంబు గావించుచున్
దేవోద్గీతి యెలర్పఁ బాడుచును నర్తించెం గఠోరంబుగన్.

61


తే.

అతనిఁ జూచి యచ్చటి విప్రు లంతవట్టు, వారు నిది యేమియో యని భూరివిస్మ
యంబుఁ బొందంగ నృత్తగీతావసాన, మున నతం డిట్టు లను సభ్యజనముతోడ.

62

శంఖకర్ణుం డనుభూతంబు గోపాలకులకుఁ గలిగిన రోగంబునకుఁ గారణం బెఱింగించుట

వ.

ఏను సర్వజగద్గురుం డగుచంద్రశేఖరుం డానతిచ్చి [2]పుత్తేరం దదీయశాసనంబు
శిరంబున ధరియించి కైలాసశైలంబుననుండి మీపాలి కిప్పు డిట్లు సనుదెంచితి
గోకులంబునందు గోవులకు గోపాలురకుం దక్కినప్రాణులకు వర్తిల్లుచున్నయార్తి
తెఱం గనుసంధించి వారు పరమభక్తియుక్తిం బ్రయోగించు నీయనుష్టానంబు
నందలి సౌష్ఠవంబునకుం బ్రసన్నుం డై యమ్మహాదేవుండు నన్ను నాలోకించి.

63


ఆ.

శంఖకర్ణ నీవు సయ్యనఁ గాళింది, తటమునందు రోగతాపభరముఁ
జెంది పొరలుచున్న జీవుల కెల్లను, హిత మొనర్చు [3]పొంటె నేఁగు మేఁగి.

64


వ.

అస్మత్పూజాతత్పరు లయిన బ్రాహ్మణోత్తములలోన నొక్కనియం దావేశించి
యిట్లని చెప్పుము.

65


సీ.

ఘనుఁడు విరోచనతనయుఁడు బలికంటెఁ బూర్వజుం డాహవగర్వయుతుఁడు
గలఁడు దైత్యుఁడు కాలకలియన ద్వాపరాంతమున దానవు లెల్ల ధరణిబాధ
కుద్భవింపఁగ దొను నొకక పిత్థద్రుమమై విషోత్కటవిటపాళ యెసఁగ
యమున దక్షిణపుఁదీరమున జనించినాఁ డద్దురాత్మునిబంటు లైనయసురు


తే.

లందఱును విషకంటకవ్యాప్తవృక్ష, కోటియై దానిచుట్టునుఁ గొలఁదిమిగులఁ
బెరిఁగినారు తద్భార్య లేడ్వురు సహస్ర, పుత్రవతులైన గోవులై పొదలినారు.

66


వ.

ఆగోవులఁ గాచువారు లేక తమయిచ్చం గారువసు లై తిరుగుచుఁ బ్రాణుల వధి
యించు నవ్వెలఁగమ్రాను పుట్టిన పండ్రెండేఁడ్లకుఁ బూచి పువ్వులు వొడమినప్పుడ

  1. శివానలంబునందు
  2. నవృత్తాంతంబు
  3. కొఱకు