పుట:హరివంశము.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 5

109


తానపరంపరల్ జనపదంబు లొకంట నొకంట వేనవే
లైనవి యూళ్లు లిట్లమరె నాదయుగంబును బోలె సర్వమున్.

7


వ.

దానం జేసి భూదేవి మహాభారంబున సైరణ దొఱంగి యచల యయ్యును జల
నంబు నొంది యార్తయై యాక్రందించె నివ్విధం బరసి ధర్మలోపంబు గాకుండ
బార్థివకులం బుపసంహృతంబు సేయవలయు [1]నీవు విజయంబు సేసి మేరుశిఖరంబునం
గొలువుండి మమ్ము నందఱుం దగిన తెఱంగులకు నియోగించుట లెస్స యనిన నబ్జా
సనువిజ్ఞాపనంబు విని దివ్యశయనంబువలన నుత్థితుం డై.

8


సీ.

ఇందిరతొడలపై నింపారఁ జాఁచిన యడుగులు మణిపీఠియం దమర్చి
యొక్కింత సడలినయుత్తంసదామకం బభినవంబుగ మౌళి నలవరించి
కౌస్తుభోజ్జ్వలపదకంబునఁ బెనఁగొన్న చారహారమునులి చక్కఁ జేసి
కటిమీఁద జాఱినకనకసూత్రంబుతోఁ బీతాంబరముదిండు బిగియఁ దిగిచి


తే.

శంఖచక్రగదాభయస్ఫారచిహ్న, ములు గ్రమంబున శ్రీహస్తముల వహించి
యోగనిద్రాంతలీల యిట్లొప్ప నిలిచె, దేవదేవుఁడు దివిజులదృష్టి యలర.

9


వ.

నిలిచి తత్వమయసేవానురూపంబుగాఁ బొడసూపి యాయితం బై యున్నవినతా
తనయు వినమితస్కంధంబు బంధురోత్సాహంబున నారోహణంబు సేసి విష్వక్సేనాది
గణముఖ్యుల కోలాహలశబ్దంబులు మునుల జయజయాశీర్వాదరావంబులును
దిగ్వివరపూరకం బై చెలంగ ననేకశతసహస్రసంఖ్యంబు లగుసురనిమానంబులచేత
సేవ్యమానుం డగుచు గ్రహతారకాసంచార[2]పూరితం బగుసనాతనమార్గంబు
నిజగమనానుగ్రహంబున నతిమాత్రపవిత్రంబు ముహూర్తమాత్రంబున నరిగి
యన్విభుండు.

10


ఉ.

మేరువు గాంచె సంతతసమీహితఖేలనమోదితాప్సరో
భీరువు కందరాంతర[3]నిపీతమధూత్కటసిద్[4]ధగీతికా
చారువు నిత్యసేవనలసవ్యసనభ్రమదబ్జబంధుమం
దారువు దివ్య[5]ధామయుతదారువు సౌరభవన్న మేరువున్.

11


వ.

కని యందఱు నాత్మీయంబు లగుయానంబులు డిగ్గం దానును వైనతేయుని వలన
నవతరణం బొనర్చి.

12


సీ.

అమ్మహాశైలంబునందు మీఁదటినెత్తమున విశ్వకర్మచే మును విచిత్ర
రచనానిరూఢనిర్మాణమై కామగామిని యనఁ గామదోహిని యనంగఁ
గామరూపిణి యనఁగాఁ బెక్కువినుతుల వెలసినసభయందు వేఱువేఱ
యుచితంబుగాఁ బెట్టియున్నపీఠములలో నున్నతాసనము దా నొంది విష్ణుఁ


తే.

డబ్జజాదుల నందఱ నానుపూర్వి, నుండ నియమింప నొప్పెఁ బేరోలగంబు
యక్షగంధర్వసిద్ధవిద్యాధరోర, గాదులును వచ్చి కొలిచి రయ్యాదిదేవు.

13
  1. మీరు
  2. పూరకంబగు
  3. నివేశ
  4. గైరికా
  5. కామప్రద, ధామహృత, నామ