పుట:హరివంశము.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

హరివంశము


తే.

[1]ఆ యెడను భూమిదేవి యాత్మీయమైన, మూర్తి ధరియించి యెంతయునార్తి దోఁప
నచటి కేతెంచె నిఖిలసురాళిచూడ్కి, గములు నంతంతఁ దనమీఁదఁ గడలుకొనఁగ.

13


క.

అక్కాంత డప్పి గని కడు, వెక్కసపడి పలుకుసభ్యవితతులపలుకుల్
దిక్కూలంకషనిననం, బక్కజమై యెసఁగె వెన్నుఁ డాకర్ణింపన్.

14


వ.

అంత వాయుదేవుం డక్కలకలం బంతయుఁ గేలెత్తి వారించి వసుంధరం జూచి
నీయాగమనకార్యం బంతయు విన్నపంబు సేయు మనినం గృతాంజలి యై యా
జగద్ధారణి యుదారధీరస్వరంబున ని ట్లనియె.

15

ప్రజాభారపీడిత యైన భూదేవి తనమనఃక్లేశంబు విష్ణున కెఱింగించుట

క.

ఈపురుషోత్తమదేవుఁడు, నీపరమేష్ఠియును వేల్పు లిందఱు వినఁగా
నాపాటెల్లం దగ వి, జ్ఞాపన మొనరింతు వినుఁడు సభ్యులు గరుణన్.

16


వ.

ఏను జగత్కర్తచేతం జరాచరభూతధారణం బధికారంబుగాఁ బ్రతిష్ఠిత నై
యుండుదు ని ట్లుండ నేకార్ణవకాలంబున విష్ణుకర్ణస్రోతస్సులవలన నుద్భవించి
యిద్దఱుదైత్యులు తపంబునకుం దొడంగి కాష్ఠకుడ్యసదృశు లై నిశ్చలం బగు
నిలుకడం బెద్దగాలం బున్నయంత.

17


క.

వారల దేహముల నవ, ద్వారంబులఁ జొచ్చి భూరివాయువు నాడీ
పూరణము సేయ నాశ్చ, ర్యారంభతఁ [2]బొదలి పెరిఁగె నఖిలాంగములున్.

18


వ.

ఇట్లు పెరిఁగి దిశలు నాకసంబుం దారయై యున్న యయ్యసురులకడకు బిసరుహాస
నుండు వచ్చి కరంబున నిరువుర నంటి చూచి యొక్క నియొడలు మృదువును
వేఱొక్కని [3]మేను కఠినంబును నైనం దదనురూపంబుగా వారికి మధుండునుం
గైటభుండు ననునామంబు లొనరించె ననంతరంబ వారు.

19


క.

తనువులవ్రేఁగున [4]మదముం, గొని నీళులనడుమ నిద్రగూరి యొరగి యె
న్న నగోచర మగుకాలము, సనుటయుఁ దెలివొంది పటుభుజాదర్పమునన్.

20


మ.

తమతోడం బెనగంగ నోపెడు సముద్యత్సత్త్వవంతుండు వి
క్రమదుర్దాంతుఁడు గల్గునొక్కొ యని యాకాంక్షన్ సమస్తార్ణవౌ
ఘములన్ రోయుచు నేఁగుదేరఁ గని [5]యాకంపించి యాశౌరి నా
భిమహాపద్మము సొచ్చి బ్రహ్మ యడఁగెన్ భీతిప్రకర్షంబునన్.

21


క.

ఆయవసరమున నెంతయు, నాయితమై యెదురు నడచె నసురరిపుఁడు దై
తేయులుఁ బ్రమోదవితత, వ్యాయతబాహులయి తాఁకి రవ్వీరవరున్.

22


వ.

వారలతోడ నద్దేవునకు ననేకదివ్యాబ్జసహస్రం బగుకాలం బద్భుతం బైన సమ
రంబు ప్రవర్తిల్లె నమ్మధుకైటభు [6]లొక్కించుకయు డప్పిం బొందక ఖేదరహితుం
డై యున్న వెన్నునివిధంబు చూచి యచ్చెరువు నొంది తద్భుజావిస్ఫురణంబు
నకుం దప్పిపోవం దమకు శక్యంబు గామియు నెఱింగి యతనితోడ.

23
  1. అపుడు భూదేవి యాత్మీయ మైనదివ్య
  2. బొడమి
  3. యొడలు
  4. మధువుం; మధువులు
  5. యుత్కంపించి పద్మాక్షు
  6. లొక్కింతయు