పుట:హరివంశము.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

హరివంశము


త్సేకంబును సమస్తవినతజనాభయప్రదానలలితంబును సర్వభువనపూజితంబును
సాక్షాత్పరమేష్ఠి[1]సృష్టంబును నపరిభావ్యప్రభాపటలదుర్దర్శనంబును నగుసుదర్శన
చక్రంబు కరంబున నమర్చి.

173


మ.

సురవిద్వేషిపయిన్ సరోషపరుషస్ఫూర్తిం బ్రయోగింప న
ప్పరమాస్త్రంబు ప్రశస్తమై చని వెసన్ బాహావనం బంతయు
న్మురియం జేసి శిరంబు లెల్లఁ దునుమన్ మ్రోడై తదీయాంగ మ
చ్చెరువారం దనతొంటినిల్కడన నిల్చెం గొంతసే పద్దివిన్.

174


మ.

వినతాసూనుఁడు దాని సైఁపక మహావిస్తీర్ణముల్ గాఁగ గ్ర
క్కున ఱెక్కల్ ప్రసరించి వాయుసమసంక్షోభంబునం బాఱి తాఁ
కినఁ దద్వక్షము [2]తాఁకునన్ విఱిగి సంక్షీణాసువై కూలె దై
త్యుని[3]దేహంబు ధరిత్రి గ్రక్కదల వాతోద్ధూత[4]మేఘాకృతిన్.

175


వ.

ఇట్లు కాలనేమి కాలగోచరుం [5]డగుటయుఁ దక్కినప్రధానదైత్యు లవ్విశ్వరూపు
విశ్వవ్యాప్తివలన నెందునుం బోవనేరక క్రోల్పులికోల్తలం జిక్కినజింకల[6]తెఱంగున
బ్రమసియున్నవా రున్నచోటన యడంగి యొదుఁగ నమ్మహాబాహుండు బాహు
బలం బమర నమితవిక్రమంబు లగుచక్రగదాఖడ్గంబులం దదీయదేహంబులు
వ్రయ్యను జదియను దునియనుం జేసి ధరణిం దొరంగించెఁ బెఱయసురులు
నవ్విధంబునఁ బొడవడంగి రిబ్భంగిం దారకామయం బనుపేరి యద్దారుణసంగ్రా
మంబు నివృత్తం బగుటయు విజయవిభాసి యగునవ్వాసవానుజు నభినందింప
నరవిందాసనుండు సిద్ధసంయమిసమేతుండై చను చెంచి సబహుమానంబుగా
నిట్లనియె.

176


తే.

సురల భంగించి సన్మునీశ్వరుల కెగ్గు, చేసి త్రైలోక్యమును గాసి[7]సేయుచుండు
నాత్మ నన్నునుఁ జీరికినైనఁ గొనఁడు, దనుజుఁ డింతటివార తత్సహచరులును.

177


ఉ.

ఈయసురేంద్రుఁ గూల్చుటకు నీవొకరుండును దక్క లేఁడు నా
రాయణ మూఁడులోకముల నన్యుఁడు వేల్పుల[8]యక్కుఁగొఱ్ఱు ఘో
రాయతశక్తిమైఁ బెఱికి తప్రతిఘాతవిభూతి నెన్నఁడుం
బాయకయుండ నిప్డు గడుభవ్యునిఁ జేసితి దేవతావిభున్.

178


ఉ.

ఈవిధ మేను మెచ్చి నిను నిష్టవరంబులచేఁ బ్రకామసం
భావితుఁ జేయఁగోరి యిటు పన్నుగ వచ్చితి [9]నిచ్చమైఁ ద్రిలో
కీవరదుండ వీవు పరికింపఁగ నీకొకవాంఛితంబు ల
క్ష్మీవర యెందు లేమి గని సిగ్గునఁ బొందె మదాత్మ యిచ్చటన్.

179
  1. శ్రేష్ఠంబును
  2. నె సోఁకినం దిరిగి
  3. కాయంబు మొండెంబు
  4. భూజాకృతిన్
  5. డయినం
  6. విధంబున
  7. సేసె నెందు
  8. యక్కుగోఱు; అక్కుఁ గొఱ్ఱుటు, వా. ని.; ఒత్తుకొఱ్ఱు. సూ. ని.
  9. మెచ్చితిం