పుట:హరివంశము.pdf/151

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము ఆ. 4

103


తే.

క్రొవ్వి యివ్విధమున [1]నీవు గొన్ని కాటు, లఱచినంతన నీచేత నగునె యొకటి
యాడినట్ల చేయనివాని నకట పురుషుఁ, డండ్రె రజ్జులాడునే శూరుఁ డైనవాఁడు.

165


ఉ.

దానవకీట నీవటు పితామహుఁ డిచ్చినయీగి నమ్మి
ర్మానఘనుండవై సదవమాన మొనర్చితి దాని కంతకుం
బో నినుఁ దొంటిదానవులపోకన పుచ్చి నిలింపులన్ యథా
స్థానములందు నిల్పెద ముదంబునఁ దాపసకోటి మెచ్చఁగన్.

166


వ.

అనినం గినిసి విబుధవిరోధి క్రోధద్విగుణారుణరోచు లగులోచనంబులం బుండ
రీకలోచనుం దప్పక చూచి [2]బాహాశతంబునం బృథగ్విధంబు లైనయాయుధంబు
లన్నియుం బూన్చి మయతారవిప్రచిత్తిప్రభృతిదైత్యు లాత్మీయప్రహరణపాణు
లై తోడం దఱుమం దరియం జొచ్చి పొదివినం గులక్షోణిధరంబు[3]పోలిక నక్షో
భ్యుం డై యాసమరవిచక్షణుండు నిలుచుటయం గని సైరింపక.

167


ఆ.

కాలనేమి యార్చి కాలదండము వోని, ఘోరగద యమర్చి దారుణంపు
హాస మెసఁగ నుఱక యశరి గరుత్మంతు, గుఱిఁచి వీచి వైచెఁ గ్రూరభంగి.

168


క.

హరి చూచి వెఱుఁగువడ [4]న, ప్పరుషప్రహరణము వచ్చి పక్షీంద్రుని ని
బ్బరముగఁ దాఁకిన వడఁకెం, బొరి నాతఁడు వజ్రనిహతభూధరము[5]క్రియన్.

169


చ.

కరుణఁ దదీయదుర్భరత గ్రక్కున మాన్చి జవంబు సత్త్వవి
స్ఫురణముఁ దొంటికంటెనుఁ బ్రభూతముగా నొనరించి దేవుఁ డు
ద్ధురుఁ డగుశత్రు జంపుటకు దోహలియై రభసోగ్రభంగి నా
గరుడనితోడఁ గూడ నిజకాయము వర్ధన మొందఁ జేసినన్.

170


శా.

బాహువ్యాప్తి యశేషదిగ్భరిత మై భాసిల్లె వక్షస్స్థల
వ్యూహ[6]క్రాంతి నిరుద్ధమయ్యె గగనం బూర్థ్వంబు మూర్ధాగ్రస
న్నాహవ్యాహతిఁ దూలె నంఘ్రి[7]యుగమున్ సర్వోర్వియుం జెందె సం
గూహంబున్ సురశత్రు లుద్గతభయక్షోభార్తులై [8]రెల్లెడన్.

171


ఉ.

క్రమ్మఱ విశ్వవిక్రమణకర్మ మితండు [9]దొడంగె నొక్కొ చో
ద్యమ్మిది యంచు వేల్పులును దాపసులుం బరమేశ సత్కృపా
ర్ద్రమ్మగుచూడ్కిఁ జూడు మము దైత్యవిఘాతన మాచరింపు లో
క మ్మఖిలంబు గావు మని గాఢమతిం [10]బ్రణుతించి రవ్విభున్.

172

విష్ణుదేవుఁడు చక్రాయుధముచేతఁ గాలనేమిం జంపుట

వ.

అమ్మహాప్రభావుండు భవ్యం బగునిజతేజంబునం బ్రత్యర్థితేజంబు తిరోహితంబు
సేయుచుఁ గల్పాంతసహస్రకరమండలప్రచండంబును దుస్సహసహస్రా[11]రోపేతం
బును విమతసహస్ర మేదోరుధిరదిగ్ధంబును సకలచరాచరభూతభయావహో

 1. నిపుడు
 2. బాహు
 3. పోలికి
 4. నప్పరమ
 5. గతిన్
 6. క్రాంత
 7. మహిమన్
 8. రందఱున్
 9. దొణంగి
 10. వినుతించి
 11. రఘారంబును