పుట:హరివంశము.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 3.

63


వ.

ఆధన్వంతరికిఁ గేతుమంతుఁడును నతనికి భీమరథుఁడును బుట్టిరి. భీమరథునకు దివో
దాసుం డుద్భవించి నికుంభుఁ డను మహాత్ముశాపంబున వేయేండ్లు మనుష్య
శూన్యయై రాక్షసనిలయం బైన నిజరాజధాని యగు వారాణసి వసియింప
ననువుగాక గోమతీతీరంబున నగరంబు గావించి యుండి.

87


సీ.

హైహయదాయాదుఁ డైన భద్రశ్రేణ్యు తనయులు నూర్వురు తనకులంబు
వారలఁ జంపి దుర్వారులై తమఁ బిన్ననాఁడు గైకొనక యున్మాదలీల
[1]మందల విడిచిన మహనీయతపమున సుతుఁ బ్రతర్దనుఁ డను శూరుఁ బడసి
శత్రులఁ జంపించి శత్రుజి త్తనునామ మాత్మజునకు నిచ్చె నతనిపుత్రు


తే.

లలఘుభుజులు వత్సుండు భర్గాహ్వయుండు, నందవవత్సుఁడు పితృభక్తి నతిశయిల్లి
తండ్రి దయ నొసఁగగ ఋతుధ్వజుఁ డనంగఁ, బేరు వడసె నెంతయును సంప్రీతి [2]యలర.

88


వ.

మఱియునుం గువలయం బను నశ్వంబు గలుగుటం గువలయాశ్వుం డనియుం
[3]బ్రసిద్ధుం డయ్యె నతనికి నలర్కుం డనురా జుద్భవించి యనేక[4]శత్రుసంక్ష
యం బాపొదించి కాశీపురంబు క్రమ్మఱ నెక్కించి యఱువదియాఱువేలేండ్లు
వసుధ పాలించె నతని కొడుకు క్షేమకుంచును నాతనితనయుండు సునీథుండు నతని
సుతుండు క్షేమ్యుండుఁ దత్పుత్రుండు కేతుమంతుండును దత్ప్రభవుండు వర్ష
కేతుండును దదీయసుతుండు విభుండు నన వెలసిరి విభునకు నావర్తుంచును
నావర్తునకు సుకుమారుండును సుకుమారునకు సత్యకేతుండును జన్మించి రిట్లు
కాశీశ్వరు లైశ్వర్యంబున నెల్లచోట్లం బేరు గనిరి గర్గుం డను వానివలనం
గలిగినవా రనేకులు నిజకర్మభేదంబుల వేర్వేఱ వివిధబ్రాహ్మణక్షత్రియవైశ్య
శూద్రవంశంబులకుఁ గర్త లై రింక సుహోత్రుసంతానంబు వినుము సుహో
త్రుండు హస్తిం గనియె నాతండు హస్తిపురంబు నిర్మించె నారాజునకు నజ
మీఢద్విమీఢపురిమీఢు అనువారు మువ్వురు పుట్టి రంత నజమీఢునకుం
గేశినియు [5]సలినియు ధూమినియు నను భార్యాత్రయంబు గలిగిన వారిలోనఁ
గేశినికి జహ్నుండు జనియించి.

89

జహ్నునకు గంగాదేవి కూఁతురైన వృత్తాంతము

సీ.

అఖిలరాజన్యుల నాత్మవశ్యులఁ జేసి యైశ్వర్యసామగ్రి యతిశయిల్ల
సర్వమేధం బనుసత్రంబు గావించుచుండంగ నబ్ధిసంయుక్తి కరుగు
గంగ యాతనిమఖాగారంబుపై వెల్లి వొడిచిన నల్లి యద్భుతతపస్వి
యగు నమ్మహాత్ముఁ డయ్యమరతరంగిణిఁ గనుఁగొని తగునె యీగర్వ మిట్లు


తే.

మూఁడులోకంబులందును ముమ్మొగములఁ, బాఱు నిను నెందు లేకుండఁ బట్టి కుదియఁ
దిగిచి నీ రెల్లఁ గ్రోలెద దేవతలకు, నైన మాన్పంగ వశమె నాదయిన పేర్మి.

90
  1. నుందను
  2. వెలయ
  3. ప్రభవించి
  4. రాక్షస
  5. నీవియు