పుట:హరివంశము.pdf/112

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

హరివంశము


వ.

అనుచుఁ దత్పయఃపానంబునకుం దొడంగిన నతని నఖిలమునివరేణ్యసముదయం
బులు ప్రార్థించి యమ్మహానదిం దదీయదుహితంగాఁ గల్పించి యనల్పం బగు
నయ్యుత్సాహంబు వారించి రట్టి జహ్నుండు శరీరార్ధంబునం దటినీరూపధారిణి
యైన యువనాశ్వపుత్రి కావేరియందుఁ బుత్రు [1]నజితుం డనువానిం గనియె
[2]నజితునకు బలాకాశ్వుండు పుట్టె నతనికొడు కైన కుశికుండు.

91


చ.

తనయు మహేంద్రతుల్యవిభుఁ దా మహనీయునిఁ గాంతు నంచుఁ బే
ర్చిననియమంబునం దపము సేయఁగ దద్దయు భీతిఁ బొంది యా
తనికిఁ [3]బ్రదీప్త తేజమునఁ దాన తనూభవుఁడై జనించె న
య్యనిమిషభర్త గాధి యన నంచితకౌశిక[4]తాసమున్నతిన్.

92


వ.

గాధికి విశ్వామిత్రుం డగ్రజుండుగా విశ్వరథుండు విశ్వకృత్తు విశ్వజిత్తు నను
కొడుకులును సత్యవతి యను కూతురుం బుట్టి రాసత్యపతి ఋచివలన జమ
దగ్నిం గాంచె విశ్వామిత్రునకు దేవరాతప్రముఖు లనేకులు జన్మించి బ్రహ్మ
క్షత్రగోత్రకర్తలై రిది జహ్నువంశంబు.

93


క.

విను [5]నలిని యనెడు రెండవ, వనితను నజమీఢుఁ డధికవైభవుఁ బుత్రుం
గనియె సుశాంతునివరనం, దనుఁ [6]బురుహేతి [7]యనువాని దగఁ బుట్టించెన్.

94


వ.

పురుహేతికి [8]బహ్వశ్వుండు పుట్టె [9]బహ్వశ్వునకుం దనయులు ముగ్గలుండు
సృంజయుండు బృహదిషుండు యవీనరుండు క్రిమిలాశ్వుండు ననువారు గలిగిరి.

95


క.

జనకుఁడు వీ రేవురు బహు, జనపదరక్షణమునందు [10]శక్తు లనుచుఁ బే
ర్కొనెఁ బాంచాలురఁ బరముల, ననఘా పాంచాలురై రుదగ్రవిభూతిన్.

96


వ.

తదీయదేశంబులు పాంచాలంబు లనంబరఁగె వారిలోన ముద్గలు నకు మౌద్గ
ల్యుండు పుట్టి నలపుత్రి యైన [11]యింద్రసేనయందు [12]వారస్యుం గనియె
సృంజయునకుఁ బంచజనుండును బంచజునునకు సోమదత్తుండును సోమదత్తునకు
సహదేవుండును సహదేవునకు సోమకుండునుం బుట్టిరి.

97


క.

సోమకునకు నూర్వురుసుతు, లాముష్యాయణులు జంతుఁ డాదిగఁ గీర్తి
శ్రీమహితు లైరి పృషతుం, డా మొత్తంబునకు నెల్ల నవరజుఁ డధిపా.

98


వ.

పృషతునకుం బుత్రపౌత్రు లై ద్రుపదదృష్టద్యుమ్ను లన వెలసిరి మఱియు
నయ్యజమీఢునకు మూఁడవభార్య యైన భూమిని భవదీయపూర్వవంశజులజనని
యధికతేజుం డగు తనూజుం బడయుదు నని.

99


క.

అనలపరిచర్యయును భో, జననిమతి యు[13]పాశ్రయంబు సంధిల్లగ హా
యనములు పదివేలు తపం, బొనర్చె నిటు సేయ వశమె యువిదల కనఁగన్.

100
 1. సలజుం
 2. సలజునకు
 3. బృథుత్వ
 4. తేజుఁ డున్నతిన్
 5. విను నిమియనంగ రెండవవనితకు విను గవిని యనఁగ
 6. పురుజాతి
 7. ని నతండు
 8. వాద్ర్యశ్వుండు
 9. నతనికి
 10. ఁజతురు
 11. నీలపుత్రి సం. ప్ర.
 12. వధ్యశ్వుం; వధ్వన్వ్యు
 13. వాగ్యమంబు