పుట:హరివంశము.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

హరివంశము


వ.

ఋశ్యశృంగునకుం బత్నిగా నిచ్చిన నమ్మహాత్ముండు పుత్రకామేష్ఠి సేయింపం జతు
రంగుం డను కొడుకుం గనియె. నాచతురంగునకుఁ బృథులాక్షుండు పుట్టి చంపుం
డను పుత్రుం గాంచె. వానిపేర నంగరాజధాని యగు చంపానగరంబు గలిగె. నట్టి
చంపునకు హర్యంగుండు ప్రభవించె.

79


చ.

మునిపతి ఋశ్యశృంగుఁ[1]డు ప్రమోద మెలర్పఁగ శత్రు[2]దారణం
బను సురవారణంబు దనకై నిజమంత్రబలంబుపేర్మి మే
దినికి డిగింపఁగాఁ గొని యుదీర్ణవిభూతిఁ బురందరాదులం
గొనక వెలింగె శాత్రవ[3]విఘూర్ణనఘోరభుజాబలంబునన్.

80


వ.

అట్టి హర్యంగునకు భద్రరథుండు పుట్టె. నతనికి బృహత్కర్ముండు పుట్టె. నాతనికి
బృహద్భానుండును నవ్విభునకు బృహన్మనుండు నమ్మహీపతికి జయద్రధుండు
నమ్మహీపతికి బృహత్కర్ముండు నారాజునకు విజయుండు నన్నరేంద్రునకు దృఢ
వ్రతుండు నాజననాథునకు సత్యకర్ముండునుం బుట్టి. రిది యంగవంశం. బింక ఋచే
యువు నన్వయంబు సెప్పెద.

81


క.

వినుము ఋచేయువుతనయుం, డనఘా మతినారసంజ్ఞుఁ డతనికి మువురుం
దనయులు సుమతియుఁ బృథుఁడును, ఘనుఁ డప్రతిరథుఁడు ననఁ బ్రకాశితతేజుల్.

82


వ.

వారు వేర్వేఱ వంశకర్త లై. రమ్మువ్వుర [4]వెనుక నందనుం డను కొడుకు ధర్మనే
త్రుం డను నామాంతరంబు గలిగి జనియించి దుష్యంతుండు శుష్యంతుండు ప్రవీ
కుంకు [5]ఖగుండు ననువారి నలువురఁ బుత్రులం గాంచె. నందు దుష్యంతుఁడు.

83


క.

స్వీకృతనాగాయుతబలు, శాకుంతలుఁ బడసెఁ భరతు సర్వదమను లో
కైకప్రకాశకీర్తి న, నేకాధ్వరధుర్యు నార్యహిరచరితు సుతున్.

84


వ.

అతనికి మువ్వురుభార్యలయందుఁ దొమ్మండ్రు కొడుకులు గిలిగి మాతృశాప
కలితం బగు నాశంబు నొందినం బిదప భరద్వాజుండు యజనంబు సేయింప వితథుం
డను [6]తనయుండు జనియించి.

85


సీ.

సుతుల సుహోత్రుఁడు [7]సుతహోత గయుఁడు గర్గుండు కపిలుం డనఁగోరి కనియె
నేవుర నందులో నిద్దఱు కాశ్యుండు గృత్స్న[8]మదుండు నాఁ గీర్తనీయు
[9]లాసుతహోతకు నాత్మజు లుగయించి రాగృత్స్న[10]4మదునకు నగఘ గార్త్స్న్య
[11]మదు లనఁ బరగు బ్రాహ్మణులును క్షత్రియవైశ్యులు గలిగి యవ్వసుధఁ బరఁగి


తే.

రగ్రజుండై న కాశ్యున కధికబలుఁడు, దార్ష్ట్యుఁ డుదితుఁడై సుతు దీర్ఘతపునిఁ గాంచె
దీర్ఘతపునకుఁ బుత్రుండు దివ్యమూర్తి, యైన[12]ధన్వంతరిసమాఖ్యుఁ డవతరించె.

86
  1. ఁడను
  2. వారణం
  3. విఘూర్ణకఠోర
  4. వెనక
  5. అనఘుండు ననఘుండు
  6. తనూజుండు
  7. సుతహోత
  8. పతుండు
  9. లాసుతహోతకు
  10. పతికిని ననఘ గార్త్స్న్య
  11. పతులనఁ బుత్రులు బ్రాహ్మణక్షత్రియ
  12. ధన్వంతరీడ్య తదాఖ్యఁ బుట్టె.