పుట:హరవిలాసము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 67

రంబునం జామీకరకింకిణీక్వాణంబులు సెలంగ ముహూర్తంబునకు నగేంద్రగుప్తం బగునోషధిప్రస్థపురంబునకుం జని తదీయోపకంఠంబున డిగ్గిన. 89

మ. వనగంధద్విపరాజి నెక్కి యధికవ్యాయామవిష్ఫారసం
హననుల్ బంధులు మేదినీధరము లుద్యత్కీర్తితోఁ దోడు రా
మనమందుం బ్రమదంబు పొంగ దీవిషన్మాన్యుండు ధీరుం డెదు
ర్కొనె నీహారగిరీశ్వరుండు సుమనఃకోదండసంహారునిన్. 90

వ. ఇట్లెదుర్కొని తుషారగిరీశ్వరుండు మేనకాదేవి పసిండిపాత్రంబుల జలంబు వోయ సురాసురకిరీటమణిశాణోత్తేజితంబు లగుపురాసురాంతకునిపదంబులు గడిగి కన్యాదానం బొనరించె నంతం దుషారగిరికన్యకాశంకరులు సంకల్పసిద్ధి వడసిరి నిర్వృత్తపాణిగ్రహణమహోత్సవులై భవానీభర్గులు భక్తిభావనావశంవదులై బ్రహ్మాసనాసీనుం డగుపితామహునకుం బ్రణమిల్లిరి చతురంతవేదికామధ్యాధ్యాసీనులై పార్వతీసర్వజ్ఞులు లౌకికం బైనయార్ద్రాక్షతారోపణం బనుభవించి రంత. 91

సీ. అమృతబిందువులు పై నందంద చిలుకంగఁ బద్మాతపత్రంబుఁ బట్టెఁ గమల
కళ్యాణసమయార్హగద్యపద్యంబులఁ గైవార మొనరింపఁ గడఁగె వాణి
రంభోర్వశీముఖ్యజంభారివనితాళి తూర్యత్రయంబునఁ దోడు సూపె
మందాకినియును గాళిందియు నిఱుచక్కి రమణఁ బై వింజామరంబు లిడిరి
తే. వేళ యెఱిఁగి మహేంద్రాదివిబుధగణము, ముకుటముల హస్తపల్లవములు ఘటించి
వేఁడుకొనిరి మహాదేవు వినతు లగుచుఁ, జిత్తసంభవునకుఁ బునర్జీవనంబు. 92

సీ. సంబంధబాంధవసరదనుగ్రహముచే నచలాధిపతిఁ జరితార్థుఁ జేసి
కందర్పుఁ దొల్లింటికంటె నున్నతుఁ జేసి రతిదేవిహృదయవైరాగ్య ముడిపి
పెండ్లికి వచ్చిన బృందారకుల నెల్ల వివిధసంభావన వీడుకొలిపి
ప్రమథవర్గము నికుంభప్రధానమ్మును బేతాళడాకినీవితతి ననిచి
తే. కనకకలశాదిభక్త్యలంకారయుతము, నైనకౌతుకరత్నగేహంబు సొచ్చి
పార్వతియుఁ దాను నీహారభానుమాళి, పవ్వళించెను ముదమునఁ బాన్పుమీఁద. 98

వ. అనంతరంబ గంగాధరుండు భృంగిరిటవికారంబుల నిగూఢంబుగా నవ్వించియుఁ బాదసాంత్వనపరిగ్రహంబున మందమందాక్షసారంబుగా రచించియు గాఢాలింగనంబులును నీవీబంధస్పర్శనంబులును బింబాధరచుంబనంబులును నఖాంకురవ్యాపారంబులును దంతక్షతవేదనాప్రపంచితకిలికించితంబులును వెలయ బాహ్యాంతరోత్సవప్రదేశంబులు సంధించి మన్మథుం గృతార్థుం జేసి యనేక కాలంబు పరమానందంబుఁ జెంది శతానందముకుందపురందరాదులకు హితంబుగ సుతుం గాంచి యాంబికే