పుట:హరవిలాసము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68 హరవిలాసము

యుండును గాంగేయుండును గార్తికేయుండును షాణ్మాతురుండును ననునక్కుమారునివలనఁ దారకాసురు వధియింపించి మహాదేవుండు లోకంబు లన్నియు రక్షించె నిది గౌరీకళ్యాణము. 94

క. ఈగౌరీకళ్యాణము, భోగీంద్రధరాపదానపుణ్యశ్రుతిధీ
ర్యాగము దీనిం జదివిన, భోగము మోక్షమును గలుగు భూజనములకున్. 95

ఆశ్వాసాంతము

చ. కొమరగిరిక్షమారమణకుంజరచారువసంతవైభవ
క్రమసముపార్జితాభినవగంధహిమాంబుకురంగనాభికుం
కుమఘనసారసంకుమదకుంభమనోహరగంధపాళికా
సముదయసార్వభౌమ! కవిసంఘమనోభవకల్పకద్రుమా! 96

క. కరదీపదానబిరుదా, భరణా! కావేరివల్లభా! సుగుణనిధీ!
శిరియాళవంశశేఖర!, హరచరణస్మరణపగిణతాంతఃకరణా. 97

పంచచామరము.—
హరాట్టహాసమల్లికాశశాంకశంకరాచలా
మరాపగాసరస్వతీసమానకీర్తిమండలా!
కురంగనాభిగంధసారకుంకుమాదివాసనా
పరంపరావితీర్ణశస్తభవ్యహస్తపల్లవా! 98

గద్య. ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర వినయవిధేయ శ్రీనాథ
నామధేయప్రణీతం బయినహరవిలాసం బనుమహాప్రబంధంబునందుఁ
జతుర్థాశ్వాసము.