పుట:హంసవింశతి.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గౌళముల్ పచ్చాకు కచ్చూరములు చాల
నించిన కొట్టడీ ల్మించి యేఁగి
పునుఁగు చట్టంబులు బుక్కారజంబులు
పొంకమౌ మళిగల పొంతఁ దరలి
తే. చూచె నొకదివ్యరత్ననిస్తులగృహంబు
నందు హేమావతీ కన్య నలరు ధన్య
వఱలు సొంపుల టెంకి జవాది వంకి
జాతి రతిలీల నా రాజదూతి హేల. 81

వ. ఇట్లు తన్నుఁ జేరవచ్చిన రాజదూతిం గనుంగొని మహారాజు మన్ననల మనియెడు పడంతుక యని రత్నంపుగద్దియపై వసియింపంజేసి స్వాగతం బడిగిన నబ్బాలకు హేల యిట్లనియె. 82

క. నీ చాతుర్యము నీవా
చాచిత్రపటుత్వరూపసంపద లెపుడున్
నీ చుట్టంబులు సెప్పఁగఁ
జూచెదనని వచ్చినాను సుదతీ నిన్నున్. 83

ఉ. చక్కనివారిలో మిగులఁజక్కనిదాన వటంచు వేడ్కతోఁ
జొక్కుచుఁ జెప్పి రందులకుఁ జూచినయందుకు నా మనోరథం
బక్కడ సిద్ధమయ్యె ఫల మబ్బెను హా యిటులుండ వద్దె? యో
చక్కెరబొమ్మ! యంచు సరసప్రతిభాషల నిచ్చగింపుచున్.84

సీ. దీనచకోరాళి తృష్ణఁ దీర్చుఁ గదమ్మ
భామ! నీ వదనచంద్రామృతమ్ము
బీదబర్హిణముల నాదరించుఁ గదమ్మ
మెలఁత! నీ వేణికామేఘపంక్తి