పుట:హంసవింశతి.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్సొన్నాపట్టె రుమాలుగట్టె జరతాచుట్టంచు డాల్మించు మే
ల్మిన్నాసన్నపుదుప్పటంబుఁ దగహాళిన్ గప్పె సొంపారఁగన్. 75

వ. ఇ ట్లుపచారంబులఁ గొంతతాపంబు శాంతం బొనర్చి, నృపాలునకు హేల యిట్లనియె. 76

ఉ. స్వామి! పరాకు, నీమదికి సమ్మతియౌ పని యేమి చెప్పుమా!
ప్రేమ దలిర్ప నేర్పు దలఁపింప నదెంతటి కార్యమైన నే
నే మఱి తీర్చి, నీకుఁగల నెంజిలిఁ బాపెదఁ జూడుమన్న నా
శ్రీమహనీయవైభవుఁడు శీతకరాస్యకు హేల కిట్లనున్. 77

తే. సిద్ధురాలు హేమావతీ సితకరాస్య
వలపు రేఖాతిశయవైభవమును దెలుప
వినఁగ నగు మోహముననైన వెతను మాన్పు
కరుణ ననుఁ జేర్చి యమ్మచ్చెకంటిఁ గూర్చి. 78

క. అని చీనీచీనాంబర
ఘనమణిహారములు మేలు కాల్కడియంబుల్
గొనబున్ మెఱుఁగుంగరములు
చనవమరఁగ నిచ్చి పనుప సముచితరీతిన్. 79

ఉ. పూని ముదంబు లుప్పతిల భూవరముఖ్యునిచేత వీడికో
లై నవరత్నకీలితమహారజతోన్నతదివ్యదీధితి
శ్రీనిధు లెల్లదిక్కుల దిసించుచు మించిన విష్ణుదాసు స
న్మానితగేహసీమకు సుమాళముతోఁ జనె హేల హేలలన్. 80

సీ. కస్తూరివీణలుఁ గపురంపు లప్పలు
నిండిన గృహములు నెరయ దాఁటి
కుంకుమాగరుఖండసంకుమదంబులు
గలుగు బిడారులు గడచిపోయి