పుట:హంసవింశతి.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఘనదరిద్రపికాళిఁ దనియఁ జేయుఁ గదమ్మ
చెలియ! నీ వాతెఱ చివురడంబు
బడుగుజక్కవల నింపడరఁ బ్రోచుఁగదమ్మ
ముగుద! నీ చనుఁదమ్మి మొగ్గదోయి
తే. పేదకీరసందోహము నేదునమ్మ
నీ వచోబృందమకరందనిర్ఝరంబు
లిట్టి పస మిసి జిగి బిగి యీ విధంబు
ప్రణుతి సేయంగఁ దరమె యా బ్రహ్మకైన. 85

క. ఇదిగాక యత్తమామల
ముద మొదవఁగ బంధుసంఘముల దాసీదా
సదళంబుల బహువిశ్వా
సదయల నీరీతి మనుచు సతులన్ గానన్. 86

వ. అని యిత్తెఱంగున. 87

ఆ. దాని యత్తతోడఁ దగ మామతో బంధు
దాసజనముతోడఁ దగిన మైత్రిఁ
గూడి యాడుచుండి కొన్నిదినంబులు
చన్న పిదప నొంటి నున్నవేళ. 88

ఉ. ఒక్క సుధాంశురత్నరుచిరోన్నతవేదికమీఁద నిద్దఱున్
మక్కువ మీఱ నుండి యనుమానముతో నొక కొంత కొంకికొం
చక్కట! నీ కొకందులకు నచ్చిక లేక మెలంగ విష్ణుదా
సెక్కడి భర్తఁ గాఁగ సృజియించె నజుండని హేల నవ్వుచున్. 89

క. ఈ రూప మీ పటుత్వం
బీ రేఖావైభవంబు లీ నెఱప్రాయం