పుట:హంసవింశతి.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బీ రసికత నీకును మఱి
మా రాజున కగును నితరమనుజుల కగునే! 90

సీ. కలికి! నీ సిబ్బెంపు గబ్బి గుబ్బలు వాని
గడుసు చేతులఁబట్టి కలఁచఁదగునె?
కాంతరో! నీ తావి కావిమోవిటు వాని
కొక్కిదంతంబుల నొక్కఁదగునె?
చెలువ! నీ జిగి గోముగల మోము మఱి వాని
తొట్టినోరున ముద్దు వెట్టఁదగునె?
సుదతి! నీ కనకంపు సొంపు దేహము వాని
కఱకుమేనునఁ జేర్చి కలయఁదగునె?
తే. కులుకు శృంగారరసములు చిలుకఁ గీలు
బొమ్మవలె నీటు గలదానవమ్మ! నీవు
మర్కటము వంటివాఁడు నీ మగఁడు చూడ
వానితోఁ గూడి రతికేళిఁ బూనుటెట్లు? 91

క. నీవంటి రూపవతికిని
నీవంటి ప్రియుండు గలుగ నిర్మింప కయో!
యీ విధిని దగులు చేసిన
యా విధి నిటు దూర నింక నగు ఫలమేమీ? 92

తే. అయిన మగఁడెంత నీటుకాఁడైన నేమి!
ప్రాణప్రదమైన చౌశీతిబంధగతుల
నింపు సొంపును జూచి చొక్కింప నగునె?
రతికిఁ జొచ్చిన తఱి మానవతుల కెపుడు. 93

ఉ. కేరఁగరాదు, నవ్వి గిలిగింతలు వెట్టఁగరాదు చెక్కులన్
జీరఁగరాదు, గుబ్బలు ఖచిక్కునఁ గ్రుమ్మగఁరాదు కేళిలో