పుట:హంసవింశతి.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

vi

పీఠిక.


ణాళ్ళనుగూడఁ బేర్కొనుటయుఁ గూడ నాపైయుద్దేశ్యమును బలపఱచుచు న న్నాచరిత్రమునమిగుల శ్రమించి చర్పింపఁ బురికొలుపు చున్నది.

పంచమాశ్వాసములో "ముంగిస, సివంగి, జోణంగి, యింగిలీషు, కుక్కగుంపులఁ గోతులఁ గొన్ని గొనియె” అని చెప్పియుండుటంబట్టి చూడ నూఱు నూటయేఁబది సంవత్సరముల క్రిందట నున్నవాఁ డని చెప్పవచ్చునేమో ఇఁక నీవిషయమును వదలి ప్రకృతవిషయముసకుం గడంగెదను.

ఇక్కవికవితాశక్తి యెట్టిదనియే యిపుడు విచారింపవలయు. దేశకాలాదుల నిర్ణయించు గ్రంథములు వేఱుగా నున్నవి. ఆవిషయ మిట నంతగాఁ జర్చింపఁ దగినది కాకపోయినను సందర్భమును బట్టి మూఁడుమాటలు వ్రాయవలసివచ్చినది. ఈహంసవింశతి యైదాశ్వాసముల గ్రంథము, హంస హేమావతికి నిరువదిదినములు కథలు చెప్పి యామె పరునింటికిఁ బోకుండఁజేసినది. కావున హంసవింశతి యని గ్రంథమునకు నామముగల్గినది. గ్రంథ మంతపెద్దదిగాకపోయినను నవరత్నములను దిరస్కరించు పద్యము లిందుఁగూర్పఁబడియుండుటచే నిది వరమణిహారమని చెప్పకతప్పదు. ఒక్కదానినిమించి వేఱొక్క పద్య మలరారుచుండును. శైలియో రసికజనహృదయానందజనకము. కథలో నొకదానిని మించి వేఱొకటి బుద్ధిచమత్కారమును జూపుచున్నవి. ఇట్టి యుత్కృష్టగ్రంథరాజమునువ్రాసి యిమ్మహాకవి సమానులలో నుత్తమశ్లోకుఁ డయ్యెను. వేయిమాటలేలగాని యిక్కవిమహేంద్రునివలెఁ గవిత్వము చెప్పుట కడుదుర్లభము. కందమునకుఁ గవిబ్రహ్మ యగుతిక్కయజ్వ యని విని యుంటిమి. తరువాత నే నని యాధునికులలోని కవిచౌడప్ప చెప్పుకొనియెను. ఇమ్మహాకవి కందపద్యముల నల్లుటలోఁ దిక్కయజ్వను మించె నని చెప్పి మహాపాతకము నార్జించుకొన సభిలషింపనుగాని యంతవాఁ డని చెప్ప జంకుపడి వెనుకంజవేయను. ఒక్క కందములేగా దేపద్యము చదివినను సెబాసని శిరఃకంపము చేయవలసియే వచ్చును. నారాయణకవిని నోటికసి దీరఁ దిట్టవలయు నని పూనుకొన్న కఠినాత్ముఁడుగూడ సాంతముగాఁ జదివినచో నమస్కరించి శతథాసహస్రథా పొగడునే గాని వేఱొక మాట నోటఁ జెప్పఁజాలడని నానిశ్చయ మని త్రికరణశుద్ధిగాఁ జెప్ప సాహసింపు చున్నాను.

ఈ గ్రంథము నీతిబోధకము గా దనియుఁ జెడుతలంపులను వృద్ధిచేయు ననియుఁ గాన ససద్గ్రంథమనియు నిట్టి గ్రంథమునఁ దనశక్తిని వినియోగించి కవి తనజీవితమును వ్యర్థముచేసికొనియె ననియును గొందఱ తాత్పర్యము, నే నట్లనఁ జాలకున్నాను, అల్బ