పుట:హంసవింశతి.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

v


జయ్యనఁ దిమ్మయప్రభుని సత్కవితారచనాఢ్యులైనమా
యయ్యలరాజువంశజుల నాదికవీంద్రుల సన్నుతించెదన్.”

అని చెప్పుకొన్నాడు. దీనిం బరికించి చూడఁగాఁ దమపూర్వులు మహాకవులైనట్లును దానావంశసంభూతుఁడననియు, నయ్యలరాజు వారికుటుంబము విద్వత్కవికుటుంబ మనియుఁ జెప్పుకొన్నట్లు స్పష్టము. ఇందతిశయోక్తి యెంతమాత్రములేదు. పయిపద్యమునఁ బేర్కొనఁబడిన రామభద్రాదికవులు కడప కర్నూలు మండలములోని వారయిసట్లు స్పష్టమైనందున నీతఁడుగూడ నీప్రాంతముల నివసించినవాఁడే యని తోఁపక మానదు. ఇతని దీగ్రామ మని నిశ్చయింపఁ దగినయాధారము లీ గ్రంథమున లేవు. ఊహ లెవరి కెట్లుతోఁచునో యట్లు నిర్ధారణము చేయునవకాశ మిందువలనఁ గలగుచున్నది. ఇటీవల నాకుఁ దెలియవచ్చిన విషయ మేమనఁగా ఈనారాయణకవి కడప మండలములోని పుల్లంపేట తాలూకాలోనున్న పొత్తపియనుగ్రామములోనివాఁ డని, దానికిం దగినన్ని సాధనములు దొరకినంగాని 'ఇదమిత్థ' మ్మని సిద్ధాంతము సేయఁజాల కున్నాను.

కొందఱు నారాయణకవి నెల్లూరుమండలములోని గోరుగుంతలపా డనుగ్రామముస నుండినవాఁడనియుఁ గావున తనయొక్కయు తన మేనమామయొక్కయు గ్రామములకుఁ జెంతనున్న కంభము, మార్కాపురము మొదలగు గ్రామముల పేరులు చెప్పె ననియు వ్రాసిరి. ఆమాట విశ్వాసపాత్రముమాత్రము గాదు.

హంసవింశతి పంచమాశ్వాసములో గ్రామములపట్టికలో "రాయదుర్గము, గుత్తి, రాయవేలూ, రానుగొంది, మాహురి, కాశి, గోలకొండ,...” అని ప్రారంభించి కలగూరగంపగా నామములు చెప్పఁబడియున్నందున దత్తమండలవాసియే యని స్పష్టమగునేకాని యితరవిధముగాదు, మఱియుఁ దక్కిన కొన్ని మండలములోని పెద్ద పెద్ద గ్రామములపేరులు చెప్పి దత్తమండలములోనున్న చిన్నపల్లెలపేరులు కూడఁ జెప్పియున్నందున బైయూహకుఁ బ్రబల మగునాధారము కనఁబడక పోదు. అందును గడపమండలములోనున్న పోరుమామిళ్ల, సిద్ధవటము, కనూరు, (కసునూరు) గండికోట, సింహాద్రిపల్లి, ఫుట్లూరు, చింతగుంట మొదలగు గ్రామముల పేరులు చెప్పబడియుండుటంబట్టి పరికించినను దత్తమండలములలోఁ గడపమండలవాసియే యని నిర్ధారణము చేయ నవకాశముగల్గునే కాని వేఱొకయూహ కవకాశము కల్గదు. ఇంతమాత్రముచేతనే యీ నాయూహయు నిశ్చయముకానేరదు. దత్తమండలకవి చరిత్రమును, వ్రాయుచున్నాఁడను గాన, నప్పుడు చర్చించి వ్రాసెద పుష్పగిరితిరు