పుట:హంసవింశతి.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xiix

"వలపు రేఖాతిశయ వైభవము" (1-78) ప్రౌఢతనము (1-235) ఓ మగరాజ (1-107) అపసిరి (1-126) సర్వబంధకత్తెర (1-206) ఏక తాళాటతాళాదులు (5-122) బహువెలల్‌వెట్టి {5-353) వంటి వైరి సమాసములు నిశ్శంకముగా వాడఁబడెను. వ్యతిరేకక్త్వార్థకములు ద్రుతాంతములు గావించెను. కమండలంబు (5-12) (కమండలువు) ధృవము (ధ్రువము) (5-122) వంటి శబ్దవికారములు, పరోపకారిణి భాగ్యశాలిని అనుటకు 'పరోపకారిరా యిక్కలకంఠకంఠి' (1–237) 'పరమ భాగీరథివి మహాభాగ్యశాలి వనుచు దీవించి' (3-138) వంటి పుంలింగ రూపములు రచింపఁబడెను. 18వ రాత్రి కథలో వొకనారికి "విహారి" యను నామకరణము చేసెను.

సంభాషణ ధోరణి

తే. పంటితో నీళ్లుపట్టుక యింటిలోకిఁ
    బోయి, 'యేడుంటి వీసరి ప్రొద్దుదనుక?" (4-235)

మగని గద్దించి బెస్తబిత్తరి ప్రశ్నించు సందర్భమిది. ఇంటిలోకి, ఇంట్లోకి ఏడుంటివి? యాడికి పొయ్యుంటివి? ఇవి కవి ప్రాంతీయపు మాటలు.

'పోతు వెడలి పొయ్యీని, వాకిలివేయు మనుచు మగనితోఁ' గుమ్మరి యెమ్మెలాడి పలుకును. (5-78)

‘అరుగుమింద కూచోబెట్టినావు. బిడ్డ కిందపడీని' అనుట కలదుకదా! వీనివిఁ దక్కువ తరగతి స్త్రీలు మాటాడుమాట లనరాదు. ఎక్కువ తరగతి సుదతియు- "చేనంట, అమ్మ! నొచ్చీనె యనును” (రాధికాసాంత్వనము. 1-124)

గ్రంథ పరిస్థితి

1964 సం.న వావిళ్ళవారు హంసవింశతి కొక నూతనరూప మిప్పించిరి. కీ. శే. మద్దులపల్లి వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రిగారు మిక్కిలి శ్రమించి పరిశోధించి, చాలఁబద్యములకు నర్థ తాత్పర్యాదులుగూడా వ్రాసిరి. అర్థాన్వయ నియమాదులు పొసఁగని పద్యములను దిద్దితీర్చి పొసఁగించిరి. అభేద్యములుగానున్న పద్యము