పుట:హంసవింశతి.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxxviii


తలద్రి ప్పెనుబోతనియె (5-36)

ఆ జవరాలు దా ల్చొగిన్ (దాల్చి + ఒగిన్) (5-84)

చ. “ఖరకరుఁ డస్తమించుదనుకా నొకరీతి”

(దనుకన్ + ఒకరీతి) ద్రుతముపై నచ్చునకు సంశ్లేషము గూర్చిన నొక విధముగ నుండెడిది. ఇతఁడు కావలసియే కాకు దీర్ఘమిచ్చినాఁడు. వైజయంతీ విలాసమున సారంగు తమ్మయ ప్రయోగ మిట్లే యున్నది.

సీ. "నే నిద్రబోవు దాకా నిద్ర బోవదు” (వైజ. 2–126)

ఇవి వ్యావహారిక సంధులు. వీనినిఁ దప్పు అని చెప్పుటయే తప్పు. చెవి కింపుగా నున్నవా? లేవా? అన్నదే విచారము. ఎబ్బెట్టుగా నున్నచోఁ దప్పులే.

'శుభవాటి' అను సుందరిని వర్ణించునపుడు 'టీ' ల కొఱకు ఏదారిఁ ద్రొక్కినాఁడో చూడుఁడు - గడుసరి.

తే. అతని వధూటి శుకఘోటి నలరు మేటి
   యొడయఁ డేలేటి సీమాటి యొఱపు గోటి
   కొన నెగయ మీటి యిదియేటి కులుకనేటి
   బోటి కెదిరేటి శుభవాటి నీటు మెఱయు. (2–185)

తెనాలి రామకృష్ణుఁడు, పింగళి సూరన్న, 'నుయిదాటే వానికిన్', 'గుడి మ్రింగే వానికిన్' అను ప్రయోగములు చేసిరి, ధూర్జటి శైవకవుల త్రోవఁ ద్రొక్కి మఱీ స్వతంత్రించి, 'చేసిందేటిది', క్రీడించుక' (క్రీడి + ఇంచుక) వంటి సంధులును దీర్చెను. పుచ్చుకొనుటకు 'పుచ్చుక' రూపమిచ్చెను. హంసవింశతి కవి తృతీయా విభక్తి ప్రత్యయ మగు 'తో' హ్రస్వాంతముగాఁ గూడ వాడెను. "ఉపనాయకులతొ” రతికేళి (5-312) ఈ పద్దతి కందార్థములలో దరువులలో గోచరించును. “మా నెఱజాణవు” (4-104) (మహా + నెఱజాణ) వ్యావహారిక ప్రయోగము.