పుట:హంసవింశతి.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124 హంస వింశతి

తంబుర రావణహస్తంబు రవాలుఁ గిన్నర తిపిరికిన్నర సిద్ధకిన్నర దండె మొదలయిన హృద్యానవద్యవాద్యవిశేషంబులు దిక్కులు పిక్కటిల్ల నిర్ఘోషంబులు బోరుకొల్ప నడుగడుగునకు నీరాజనంబులు నేకారతి పంచారతి యళఘారతి కుంభారతి శేషారతి గరుజారతి పురుషమృగారతి మంగళారతి యేకదళారతులు కూర్మస్వస్తిక నభోమంటప రంగవల్లిక లింగస్వస్తిక సర్వతోభద్ర గిరిబంధ మయూరనాట్య నాగబంధ వింజామర వ్యజనచ్ఛత్ర సింహతలాట బృందావన కల్పవృక్ష పాలసముద్ర గంగాతరంగ శంఖచక్ర పద్మంబులను పేరు గల్గిన మ్రుగ్గులు మాణిక్య మౌక్తిక ప్రవాళ మరకత పుష్యరాగ వజ్ర నీల గోమేధిక వైడూర్యంబులను నవరత్నంబులం దీర్చి పుణ్యభామిను లెత్తుచుండ దశాంగ గుగ్గులు సామ్రాణి సజ్జరస శ్రీవాస సరళ యావన వృక్షధూపంబులు ఘుమ్మురను వాసనలుఁ గ్రమ్ముకొనఁ బశ్చిమభాగంబునఁ బరమభాగవతోత్తములు శ్రీవైష్ణవులుఁ గులశేఖరులుఁ ద్రైవర్ణికులు యతిరాజవింశతి పూర్వదినచర్య యుత్తరదినచర్య క్షమాషోడశము శఠగోపస్తవము శ్రీగుణరత్నకోశము ముకుందమాల యష్టశ్లోకి యాళవందారుస్తోత్రముఁ దిరువాయిమొడి తిరుమంత్రద్వయచరమశ్లోకంబులు మొదలయిన ద్రావిళపాఠప్రబంధములు ప్రపత్తిపూర్వకంబుగాఁ బ్రసంగింప స్థలపరస్థలంబులనుండి చూడవచ్చిన బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రులును, కోమటి కమ్మ వెలమ వేకరి పట్ర గొల్ల బలిజ కుమ్మర వలగండ బెస్త చిప్పె కమ్మరి వడ్రంగి కాళె కంచర యగసాల వడసాలె సాలె సాతాని కటిక భట్టు జెట్టి జాండ్ర తొగట గాండ్లవారును, జిత్రకార వందిమాగధ వైతాళిక జైన ఘూర్జర గౌడమిశ్రులును, భేరి భళియ ఛటికి సృగాలక చత్రజాతులును, బోయ యెఱుకు చెంచు యేనాది జలగరి వానివన్నె గట్టురంబళి యీడిగె మేదర వీరముష్టి మాష్టి యొడ్డె యుప్పరులును, నసిధావక మైలారి తురుక పింజారి విప్రవినోదులును, జాతికర్త దొమ్మరి డొమిణి బొమ్మలాటవారును, నింద్రజాలిక మహేంద్రజాలిక హస్తలాఘవ సూత్రనాటక క్షౌరక రజకులును, బోగమువారును, దెరనాటకపు జంగాలును, జంగాలు బిద్దెమువాండ్రు తెల్లకోకబత్తులు సివసత్తులు బత్తులు పలునాటివీరులు పరిహాసకులు సుద్దులకొమాళ్లు కొమ్మూరి దానళ్లు తవిరుదాసళ్లు