పుట:హంసవింశతి.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 123

వ. అప్పు డప్పద్మపత్రాయతాక్షుని తాదృశమహోత్సవం బేకశరీరంబున నిరీక్షించిన సంతుష్టి గాదని కాయవ్యూహయోగసామర్థ్యంబున ననేకదేహంబులు దాల్చి భక్తిసంయుక్తి నిరుచక్కిం జేరి వీక్షించు సూర్యచంద్రబింబంబుల డంబునం బొలుచు పట్టుగొడుగులు ధవళాతపత్రంబులు రాణింప, గరుడధ్వజాదివివిధకేతనజాతవాతాహతి నంతరిక్షంబున నుండ నళికిపడుచుండెడు నుడుగణంబుల వడువున నక్షత్రబాణపరంపరలు చెలువు మీఱఁ, బాతాళభూతలంబుల సంచరించుసంచున వియత్తలంబునం దారు విహరించం దలంచి విషవహ్నిజ్వాలికలు గురియుచు గగనంబున కెగయు కాకోదరానీకంబుల వేఁక రివ్వురివ్వున నెగిరిచను నాకసపుఁ జువ్వలు మింటనెరయ ననంతకోటిబ్రహ్మాండనాయకుండైన పుండరీకనాభుం డేతేరం గనుంగొని ప్రమోదంబున మహావేదండయానలు సేసలుచల్లిన నుల్లసిల్లు వెండిపసిండిక్రొవ్విరితండంబుల పాండిత్యంబునఁ బలుతెఱంగుల బిరుసుల వింజామరల ఫెళఫెళారభటి నెఱయ రాలు సువర్ణవర్ణనీయంబులగు పూవుమొత్తంబులు భూనభో౽౦తరాళంబులం గప్పి యొప్పుచుండఁ, దదుత్సవవీక్షణకుతూహలసమాగత శుక్రబృహస్పతిబుధాదుల పగిదిం బగులొత్తులు వెలుఁగ వెండియుఁ జక్రబాణంబులు నాకాశచక్రంబులుఁ బిట్టబాణంబులు శతముఖబాణంబులుఁ దాటబాణంబులు దేలుబాణంబులు గురుజులు కుండబిరుసులు సంపంగిపూలబిరుసులు జక్రబిరుసులుఁ బంచవన్నెబిరుసులు గజబిరుసులు మొదలైన బాణవిద్యలవైఖరులు చిత్రవిచిత్రంబుగాఁ జూపుచు బాణకారులు ముందర నడువ డమరుపుర భిడ్డమరు సహచరభయద ఢక్కా హుడుక్కా రవచాను కలహ పటహతమ్మటావజనిస్సాణ ఝల్లరీమర్దళ మురజషణాతుత్తుంభికజర్జరీ పాశకోశక్రోలు మోరీ భేరులును డోలు గౌరు గుమ్మె తమ్మెట వీరణ యురుమ యొంటికంటియురుమ పంబ జిమిడిక తప్పెట గిడిబిడి తుడుము చక్కి చుయ్యంకియును దాళ మహోత్తాళంబులును జేగంట చిటితాళంబులుఁ జిటికెలు ముఖవీణ శంఖ కాంస్యశృంగ కాహళంబులును సన్నేగాళెన ఫీరు కరకొమ్ము నాగస్వరమును సుతి చెంగు చేసన్నాయి సింగినాదము పిల్లఁగ్రోవి మ్రోలుఁబీకలును వీణె రుద్రవీణ స్వయంభువీణ మనోహరవీణ నారదవీణ బాణవీణ సరస్వతీవీణ స్వరమండలంబు,