పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

శిథిలము. మొదలును తుదయు గ్రంథమునందు లేవు. ఈ గ్రంథములోని గద్య యిట్లు గలదు,

"శ్రీమద్వేంకటాచలాధ్యక్ష కరుణాసంలబ్దా సాధారణ ప్రజ్ఞావిచక్షణాక్షణ ప్రబంథాంకాంధ్ర శబ్దజాలలక్షణ బహుచిత్రకవిత్వరచనా చమత్కార రత్నాకర కృష్ణమరాజ గర్భరత్నాకరసుథాకర గోపాలసత్కవిరాజ ప్రణీతంబున సకలలక్షణ సారసంగ్రహం బను ఛందంబునందు" (పరిషత్పుస్తక భాండాగారగ్రంథసంఖ్య 3471 ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక ఆరవసంపుటము పుట 353)


భాగవతము దశమస్కంధము

పూర్వభాగముప్రతి ప్రాచ్యలిఖితపుస్తక భాండారమున నున్నది (సంఖ్య 784) ఈగ్రంథములోని అవతారిక భాగము నిం దుదాహరించుచున్నాను.


శ్రీకరమూర్తి దేశికచక్రవర్తి
భట్టమ శ్రీచెన్నభట్టామి బొగడి