పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

కరము సుబ్బరాజు రచించిన తిమ్మభూపాలకాభ్యుదయములోని యీక్రింది సీసపద్యమువల్ల గ్రహింపనగును.


సీ. పృథుయజ్ఞవాటి నావిర్భవించిన వంది
           నరవృత్తి యెవ్యరి వర్తనంబు,
    బహువిధాభయదాన భాసమానపువిష్ణు
           భంజశాఖ యెవ్వారి పుట్టినిల్లు,
    శ్రీకాళహస్తిధాత్రీవల్లభ కటాక్ష
           పంక్తి యెవ్వారికిఁ బ్రాణరక్ష
    ననరపరసికుడా కవిపుంగవులను
           గ్రహపాత్ర మెవ్వారి కవనశైలి

గీ.‌ యట్టి రత్నాకరము వారి యన్వయమునఁ
   బ్రభవమునుబొంది దామరప్రభులవలన,
   నగ్రహారాదిబహుమతు లందియున్న
   యార్యదరితుల మావారి నభినుతింతు.

ఈకవి ద్విపదభాగవతమును, సకలలక్షణసార సంగ్రహ మను వ్యాకరణగ్రంథమును రచించెను. సకలక్షణసారసంగ్రహముయొక్క వ్రాతప్రతి పరిషత్పుస్తకభాండాగారములో నున్నది కానిప్రతి