పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గట్టిగా నాదిమకవులు గీర్తించి
దిట్టఁడై మాకవులు దీమసం బెంచి
రత్నాకరాన్వయరాజిత
రత్నాకర సుధాకరత్వభాసితుఁడు
రాజిల్లు కృష్ణమరాజనందనుఁడు
రాజిత సకలకళాతిచక్షణుఁడు
గోపాలసత్కవికుంజరుఁ డనఁగ
నేప్రొద్దు మహిలోన నింపొందువాఁడ"


ఇందలి శైలినిమిత్తము కొన్నిపఙ్తుల నిచ్చుచున్నాను.

“కలధౌత నవహేమ కవితవిశాల
నలినారిమండలోన్నతసౌధచయము
తారాపథోన్నత తపనీయతార
సార భాసురరత్నసౌధజాలములు
కమలానివాస సత్కళ్యాణవిభవ
రమణీయమందిరారామభూములును
అరుదైన వేదశాస్త్రాదివిద్యలను
పరమేష్ఠి మెచ్చని బ్రాహ్మణోత్తములు
మంత్రతంత్రోపాయమహిమలదేవ
మంత్రిని మెచ్చని మంత్రిపుంగవులు"