పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

433



పై నేయ నది మహా ప్రళయప్రచండ
భానువైశ్వానరభాను ప్రకాశ
మగుచు నేతెంచి క్రౌంచారివక్షంబు
పగటున దూరి దెప్పరముగాఁ బడిన
నరుదార నైంద్రాస్త్ర మరిబోసి డాసి1615
పరువడి విఘ్నేశుఁ బడనేయుటయును
ధరణిపై నొరగిన తనయులవంక
పరికించి క్రోధించి పాలలోచనుఁడు
హరిమీఁద ఘోరశరావళి ముంచి
గరుడధ్వజంబుపైఁ గడు కొన్ని బరపి1620
యనలాంబకమునఁ దాలాంకుని నొంచి
యనిలసాయకమున ననిరుద్ధుఁ గూల్చి
ద్రోణుని శక్తిచేఁ దునుమాడి పంచ
బాణుని శరపరంపరల మర్దించి
కలిశ మార్గణమున గురుసుతు నొంచి1625
జలధరాశుగమున సాత్యకి ద్రుంచి
సాంబుని ఘనరౌద్రశరమున నణఁచి
యంబకత్రయమున ననిలజు గెడపి